మత్తు వదలరా2 సినిమాకు రియల్ హీరో సత్య.. ఆఫర్లు ఇస్తే అదరగొడుతున్నాడుగా!

టాలీవుడ్ కమెడియన్ సత్యా గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల కాలంలో సత్యా ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్న విషయం తెలిసిందే.

 Satya Dominats To Simha, Sathya, Comedian Sathya, Dominate, Simha, Ritesh Rana,-TeluguStop.com

ఇది ఇలా ఉంటే కమెడియన్ సత్యా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.మత్తు వదలరా 2 సినిమా( Mathu Vadalara 2 )కు వచ్చిన టాక్ కు వన్ అండ్ ఓన్లీ రీజ‌న్ సత్య అని చెప్పాలి.

సత్య ముందు హీరో సింహా( simha ) తేలిపోయాడని చెప్పాలి.సపోర్ట్ ఇస్తూ సాగడం తప్ప మరేమీ చేయలేకపోయాడు.

ఈ విషయం కాదు కీలకం.కమెడియన్ సత్య కోసం రాసిన రైటింగ్.

ఈ జ‌నరేషన్ లో మంచి కమెడియన్లు చాలా మంది వున్నారు.

Telugu Sathya, Dominate, Mathu Vadalara, Ritesh Rana, Simha, Vennela Kishore-Mov

కానీ వాళ్లకు తగిన కామెడీ రాసే వాళ్లే లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సత్య, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుదర్శన్, ప్రవీణ్ ఇలా చాలా మంది మంచి కమెడియన్లు వున్నారు.కానీ వారి క్యారెక్టర్లు ఏవీ క్లిక్ కావడం లేదు.

అందుకు గల కారణం సరైన ఫన్ రైటర్లు కరువైపోవడమే.ఈ వారం వచ్చిన భలే ఉన్నాడే సినిమా క్లైమాక్స్ లో సుదర్శన్ క్యారెక్టర్ కూడా పండింది.

కానీ ఎన్ని సినిమాల తరువాత.సత్యకు ఇంత పేరు తెచ్చిన మత్తు వదలరా సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర తేలిపోయింది.

నిజానికి సింహా కాకుండా మరే హీరో వున్నా, సత్య ను ఈ రేంజ్‌ లో ఓవర్ షాడో చేయడానికి అంగీకరించి వుండేవారు కాదేమో.

Telugu Sathya, Dominate, Mathu Vadalara, Ritesh Rana, Simha, Vennela Kishore-Mov

వెన్నెల కిషోర్ ( Vennela Kishore )లాంటి స్టార్ కమెడియన్ కు సరైన పాత్ర పడి ఎన్ని రోజులు అయింది.ఒకప్పుడు ఉవ్వెత్తున పైకి లేచిన సప్తగిరికి సరైన పాత్ర పడి ఎన్నాళ్లయింది.అల్లరి నరేష్ కు సరైన కామెడీ సినిమా పడడమే లేదు.

కాబట్టి రైటింగ్ కీలకం, హీరోల సపోర్ట్ కీలకం అని చెప్పాలి.బ్రహ్మానందం ఓవర్ షాడో చేసినా హీరోలు ఒప్పుకునేవారు.

కానీ ఇప్పుడు అలా ఒకె అనడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube