టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు ప్రభాస్.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలను నటిస్తూ దూసుకుపోతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆరు ఏడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
ఇలా ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న జాబితాలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.ఇకపోతే ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించింది.ప్రస్తుతం తదుపరి సినిమాల షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్.
ఇకపోతే సాధారణంగా ప్రభాస్ వేదికలపై పెద్దగా మాట్లాడరు.విలేకరుల సమావేశంలోనూ మైక్ ను పట్టుకోవడానికి కూడా తటపటాయిస్తుంటారు.
కెరీర్ తొలినాళ్లలో షూటింగ్ లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట.ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి చిత్రీకరణలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్ అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడుకు వార్నింగ్ ఇస్తాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతాడు.అయితే అప్పుడు సెట్‌లో ప్రభాస్ డైలాగ్ లే చెప్పలేదట.కేవలం పెదవులు మాత్రమే కదిపారట.ఇంటర్వెల్ షాట్‌లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి.ఒకపక్క వర్షం.పైగా చలి.రాజమౌళి( Rajamouli ) దగ్గరకు వెళ్లి డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను.సైలెంట్‌గా చెబుతాను అని అనడంతో జక్కన్న కూడా ఓకే అన్నారట.ఆ షాట్‌లో కేవలం పెదాలు కదిపానంతే.

కానీ అక్కడున్న వాళ్లకు నేను ఏ చేస్తున్నానో అర్థం కాలేదు.షాట్ ఓకే అయిపోయింది.జనం ఉంటే ఎందుకో సైలెంట్ అయిపోతా. మిస్టర్ పర్‌ఫెక్ట్’( Mr.Perfect ) చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్ గారు సెట్‌లో ఉండగా ఇలాగే సైలెంట్‌గా డైలాగ్‌లు చెప్పేవాడిని.ఆయన పిలిచి ఇలా అయితే ఎలా? ఓపెన్‌గా డైలాగ్ చెప్పాలి.మరీ అంత సిగ్గుపడితే ఎలా? అని అన్నారు.నాతో పనిచేసిన దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు.
ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు అని అనేవారు అని ప్రభాస్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.అలా చుట్టూ ఎక్కువ మనసులో ఉన్నప్పుడు తనకు మాట్లాడడానికి చాలా సిగ్గు అని చెప్పుకొచ్చారు ప్రభాస్.
జనాలను చూస్తే సైలెంట్ అయిపోతాను అని చెప్పుకొచ్చారు.