రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండలం మానాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ,అశ్విని హాస్పిటల్ ,రెనే హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( MLA Adi Srinivas ), రాష్ట్ర యూనియన్ కోపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ప్రారంభించారు.ఉచిత మెగా వైద్య శిబిరానికి రుద్రంగి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజల నుండి వచ్చిన సుమారు 800 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు.మారుమూల గ్రామ ప్రజలకు మేము ఉన్నాం అంటూ భరోసా కల్పిస్తూ వారికి సత్వర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అభినందనియమని కొనియాడారుగ్రామాలు ఆరోగ్యం ఉన్నపుడే అభివృద్ధి సాధ్యమని, మారుముల ప్రాంతం మైన మానాల చుట్టూ ప్రక్కల గ్రామాలకు గతంలో ఏదైనా సమస్య తలెత్తుతే ఒకక్కారు ఇద్దరు తప్ప ఎవరు రని పరిస్థితి నుండి ప్రస్తుతం మేము ఉన్నాం అంటూ మానాల చుట్టుపక్కల గ్రామాలు భరోసా జిల్లా అధికార యంత్రాంగం కల్పించిందని వివరించారు.
పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్రా సమస్యలు దూరంగా ఉంటుందని అనే ముద్ర నుండి సామాజిక రుగ్మతలు రూపుమముతూ ఏదైనా సమస్యలు తలెత్తుతే మేము ఉన్నాం అంటూ సామాజిక సేవకులు అందిస్తు జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మానాల గ్రామంతో చిన్నప్పటి నుండి మంచి అనుబంధం ఉందని, మానాల చుట్టూ ప్రజల సమస్యలు పరిష్కారంలో బాగంగా ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చక్కటి నిర్ణయమని వివరించారు.
త్వరలో రుద్రంగి మండల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని,ప్రభుత్వ ఉచిత వైద్యం ,విద్య అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు.జిల్లాలో అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు.
రాష్ట్ర యూనియన్ కోపరేటివ్ చైర్మన్ మాట్లాడుతూ…మారుమూల ప్రాంతం అయిన మానాల చుట్టూ ప్రక్కల ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.
మెగా ఉచిత వైద్య శిబిరాన్నీ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండటానికి మధ్యపాననికి దూరంగా ఉండాలని, ఈ ప్రాంతంలోని ప్రజలకు రక్తహీనత సమస్యలు ఉన్నాయని వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలన్నారు.అవసరమైతే కరీంనగర్, హైదరాబాద్ ఆసుపత్రికి పంపి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడారు.కమ్యూనిటీ పోలీసింగ్ లో మీ కోసం కార్యక్రమంలో భాగంగా మానాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాల్లో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, పిల్లల నడవడిక తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, గంజాయి కి అలవాటు పడిన వారిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డి ఆడిక్షన్ సెంటర్ కి పంపించాలని సూచించారు.
ఇక్కడ డీఎంహెచ్ఓ వసంతరావు, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్ఐలు,డాక్టర్లు ఉన్నారు.