మీకు టైటిల్ చూడగానే ఓ క్లారిటీ రావచ్చు.ఈ రెండు సినిమాలను కంపేర్ చేస్తూ ఏదో విషయం చెప్పబోతున్నాము అనే స్పష్టత కూడా వచ్చే ఉండవచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోలు సోలోగా సినిమాను నిలబెట్టలేము అనే క్లారిటీకి వచ్చారో లేదంటే తమకు ప్రిఫరెన్స్ తక్కువగా ఇచ్చుకుంటే సినిమా హిట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందో తెలియదు కానీ మొన్న సరిపోదా శనివారం సినిమా( Saripodhaa sanivaaram Movie )లో కూడా నాని( Nani ) తనకన్నా హై ప్రియారిటి విలనైన సూర్య( Surya ) కు ఇచ్చాడు.
ఇది పూర్తిగా తనకు తెలుసు అయినా కూడా అందుకు ఓకే చెప్పాడు.దానికి తగ్గట్టుగానే సినిమా కూడా విజయాన్ని అందుకుంది.
అందరూ సూర్యని బాగా మెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు మరో సినిమా కూడా ప్రేక్షకులలో ఇదే ఫీలింగ్ ఇస్తుంది అదే మత్తు వదలరా సిక్వెల్( vadalara ).ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది.హీరో కీరవాణి కొడుకు అయినా శ్రీ సింహ( Sri Simha ) మొదటి పార్ట్ లో బాగానే అనిపించాడు.
సినిమా కూడా విజయాన్ని అందుకుంది.అందుకే దీనికి సీక్వెల్ కూడా తీశారు.
అయితే ఎందుకో రెండవ పార్ట్ లో మాత్రం తన బాధ్యతను సరిగా చెయ్యలేదు అని చెప్పుకోవచ్చు.తను చేయాల్సిన మొత్తం పనిని తనతో పాటు నటించిన కోస్టార్ సత్యకి( Satya ) ఇచ్చేశాడు అని అనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలకు బాగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో శ్రీ సింహ కూడా సత్య ను బాగానే వాడుకున్నాడు.కానీ పూర్తిగా హీరో నిరాశ పడిపోయి సత్య నే డామినేట్ చేయడమే కాస్త తేడా కొట్టింది.
సినిమా కచ్చితంగా విజయవంతం అవుతుంది కానీ ఇలా పక్కవారి పై ఆధారపడి సినిమాలో తీస్తూ పోతే వీరెప్పుడు హీరోలవుతారు.ఇదే దోవలో నర్నే నితిన్( Narne Nitin ) కూడా కనిపిస్తున్నాడు.ఎందుకంటే ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో నటించి వంద కోట్లు పైగా కలెక్షన్స్ కొట్టినప్పటికీ సోలో గా సినిమా నిలబెట్ట లేదు.మొదటి సినిమాలో సంతోష్ శోభన్ తమ్ముడు అయినా సంగీత్ శోభన్ అల్లాడించేస్తే రెండవ సినిమాలో మరో ఇద్దరు కమెడియన్ లతో లాగించాడు.
ఇలా పక్కవారిని హైలెట్ చేస్తూ సినిమాని లాగిస్తున్న ఈ హీరోలంతా కూడా సోలోగా సినిమాలను ఎప్పుడు నిలబెడతారో వేచి చూడాలి.