దేవర సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎన్టీఆర్ బలి కాబోతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

 Tollywood Star Hero Skipped Devara Movie Cleverly Details, Ntr, Devara,allu Arju-TeluguStop.com

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలాగే అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తుంది.

ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ట్రైలర్ లోనే కొరటాల చూయించారు.దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చని అభిమానులు కూడా భావిస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోగలరా అనే సందేహం కూడా అందరిలోనూ కలుగుతుంది.

Telugu Allu Arjun, Alluarjun, Devara, Devara Trailer, Koratala Shiva, Ntr Devara

ఇదిలా ఉండగా తాజాగా దేవర సినిమాకి సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది.నిజానికి దేవర సినిమాకు మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ కాదట ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందని తెలుస్తోంది.మరి ఈ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) అని సమాచారం.

అల్లు అర్జున్ తో ఈ సినిమా ఎప్పుడో 2020 లోనే అనౌన్స్ చేశారు.ఒక కాన్సెప్ట్ పోస్టర్ తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో( Koratala Siva ) కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు.

పైగా ఇప్పుడు దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఈ సినిమాని ప్రకటించారు.

Telugu Allu Arjun, Alluarjun, Devara, Devara Trailer, Koratala Shiva, Ntr Devara

ఇక కథ విన్నటువంటి అల్లు అర్జున్ ఎక్కడో చిన్న సందేహం రావడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.అయితే ఈ సినిమా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాకు కమిట్ అయ్యి బలి అయ్యారు అంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.మరి ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాని వదులుకొని అల్లు అర్జున్ తప్పు చేశారా లేదంటే ఈ సినిమాకు కమిట్ అయి ఎన్టీఆర్ తప్పు చేశారా అనే విషయం తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube