దేవర సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. ఎన్టీఆర్ బలి కాబోతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు.అయితే ఈ ట్రైలర్ ప్రేక్షకులను అలాగే అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తుంది.

ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ట్రైలర్ లోనే కొరటాల చూయించారు.దీంతో సినిమా అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చని అభిమానులు కూడా భావిస్తున్నారు.

దీంతో ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోగలరా అనే సందేహం కూడా అందరిలోనూ కలుగుతుంది.

"""/" / ఇదిలా ఉండగా తాజాగా దేవర సినిమాకి సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది.

నిజానికి దేవర సినిమాకు మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ కాదట ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందని తెలుస్తోంది.

మరి ఈ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్( Allu Arjun ) అని సమాచారం.

అల్లు అర్జున్ తో ఈ సినిమా ఎప్పుడో 2020 లోనే అనౌన్స్ చేశారు.

ఒక కాన్సెప్ట్ పోస్టర్ తో కూడా అల్లు అర్జున్ కొరటాల శివతో( Koratala Siva ) కొలాబరేట్ అవ్వడం ఆనందంగా ఉందని కూడా తెలిపాడు.

పైగా ఇప్పుడు దేవర నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారితోనే ఈ సినిమాని ప్రకటించారు.

"""/" / ఇక కథ విన్నటువంటి అల్లు అర్జున్ ఎక్కడో చిన్న సందేహం రావడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా అల్లు అర్జున్ రిజెక్ట్ చేసినప్పటికీ ఎన్టీఆర్ ఈ సినిమాకు కమిట్ అయ్యి బలి అయ్యారు అంటూ పలువురు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.

మరి ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాని వదులుకొని అల్లు అర్జున్ తప్పు చేశారా లేదంటే ఈ సినిమాకు కమిట్ అయి ఎన్టీఆర్ తప్పు చేశారా అనే విషయం తెలియనుంది.

వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ సినిమాలు చేయడం లో ఎందుకు లేట్ చేస్తున్నారు…