భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయి.ఇవి చాలా టేస్టీగా ఉండటమే కాకుండా భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
ప్రస్తుతం చికెన్ టిక్కా మసాలా, పాణీపురి లాంటి భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి.అలాంటి వంటకాల్లో ఒకటి అమృత్‌సరి కుల్చా( Amritsari Kulcha ).ఇది పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి వచ్చిన టేస్టీ రొట్టె.ఈ రొట్టెలో మసాలా బంగాళాదుంపలు, పనీర్ లేదా కూరగాయలను ఫిల్ చేస్తారు.
ఇటీవల ఈ కుల్చా వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది.
“అమృత్‌సర్ ఇస్ లైవ్” అనే పేజీలో ఈ కుల్చాకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గానూ మారింది.ఆ వీడియోలో చైనాలోని షెన్‌జెన్ నగరంలో అమృత్‌సరి కుల్చాను అమ్ముతున్నట్లు కనిపించింది.ఒక వ్యాపారి కుల్చాను ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తున్న తీరుని చూపిస్తున్నారు.
భారతదేశంలో లాగే పిండిని చదునుగా చేసి, తాండూర్‌లో వేయడం వరకు అన్ని పనులు చేస్తున్నారు.అలా వండిన కుల్చాను కాగితపు సంచిలో పెట్టి అమ్ముతున్నారు.ఆ వీడియోకు “చైనా( China )లోని షెన్‌జెన్‌లో అమృత్‌సరి కుల్చా – ఇది అమృత్‌సర్‌లో మోస్ట్ పాపులర్ డిష్” అని ఓ క్యాప్షన్ జోడించారు.ఆ వీడియో ఒక వారం రోజులుగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతోంది.
దీన్ని 8 లక్షల మంది కంటే ఎక్కువ మంది చూశారు.ఆ వీడియో కింద చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఒకరు “నేను అమృత్‌సర్‌లో ఉంటా, ఢిల్లీలో చేసే అమృత్‌సరి కుల్చా కంటే ఇది చాలా ఒరిజినల్, అథెంటిక్” అని వ్యాఖ్యానించారు.మరొకరు “పంజాబీ సంస్కృతి నిజంగా ప్రత్యేకమైనది.” అని అన్నారు.మరికొందరు ఆ వ్యాపారిని అభినందిస్తూ “ఇది హార్ట్ టచింగ్ థింగ్” అని అన్నారు.
కొంతమంది వ్యక్తులు తమ అనుభవాలను పంచుకున్నారు.ఒకరు “అమృత్‌సర్‌లోని సుల్తాన్‌వింద్ పిండ్ రోడ్‌లో ఉండే కుల్చాలు బాగా ఉంటాయి” అని చెప్పారు.మరొకరు “నేను గుయాంగ్‌జౌలో ఇలాంటిది తిన్నాను” అని పేర్కొన్నారు.అయితే, వీడియోలో చూపించినది అమృత్‌సరి కుల్చా కాదని కొందరు అభిప్రాయపడ్డారు.కొందరు తేడాలను గుర్తించి “ఇది అమృత్‌సరి కుల్చా కాదు, కానీ అలాంటి స్ట్రీట్ ఫుడే అయఉంటుంది” అని అన్నారు.మరొకరు “ఇది చైనా వంటకం, అమృత్‌సరి కుల్చా కాదు” అని అన్నారు.
ఒకరు నవ్వుతూ “జిటిఏ 6 కంటే ముందే మనకి చైనాలో అమృత్‌సరి కుల్చా దొరికింది” అని కామెంట్ చేశారు.