జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నేడు వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు.ఏలేరు వరదల కారణంగా అతలా కుతలం అయిన పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకున్నారు.అక్కడ నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుని వరద బాధితులతో జగన్ స్వయంగా మాట్లాడుతారు. ఆ తరువాత నాగులపల్లి, రమణక్కపేటలోని వరద బాధితులను జగన్ పరామర్శిస్తారు.
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఏలేరు పోటు ఎత్తడంతో , కాకినాడ జిల్లా అతలాకుతలం అయింది .
ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో ఈ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ వివిధ వర్గాల ప్రజలు , రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉండడం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టు కు పోటెత్తుతుందని ముందుగా తెలిసినా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టలేదని కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శ చేసింది వైసీపీ. ముఖ్యంగా ఏలేరు వరదలు కారణంగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, జగ్గంపేట , పెద్దాపురం నియోజకవర్గల్లో భారీగా పంట ముంపు నకు గురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు .దాదాపు 80 వేల ఎకరాలకు పైగా వరితో పాటు , ఇతర వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.దీంతో నేడు జగన్ పిఠాపురం నియోజకవర్గం( Pithapuram )లో పర్యటించి, మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి తాడేపల్లి వెళ్లనున్నారు.
జగన్ పర్యటన( YS jagan ) నేపథ్యంలో భారీగా పార్టీ క్యాడర్ హాజరయ్యే విధంగా ముందస్తుగా ఏర్పాటు చేపట్టారు ఆ పార్టీ నాయకులు.పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో , అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.