మొటిమలు మచ్చలు లేని ముఖాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి!

తమ ముఖ చర్మం పై ఎటువంటి మొటిమలు మచ్చలు( Acne ) లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అటువంటి చర్మం కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

 Follow This Home Remedy For Spotless And Acne Free Skin! Spotless Skin, Acne Fre-TeluguStop.com

రకరకాల చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

‌.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీ మాత్రం మీ చర్మ ఆరోగ్యానికి అండగా ఉంటుంది.మొటిమలు మచ్చలు లేని ముఖాన్ని కోరుకునే వారికి ఈ రెమెడీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

Telugu Acne Skin, Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆవు పాలు మరియు నాలుగు లేదా ఐదు కుంకుమపువ్వు రేకులు వేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి.కుంకుమ పువ్వు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎండిన తులసి ఆకుల పొడి, చిటికెడు ఆర్గానిక్ పసుపు ( Organic turmeric )వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న కుంకుమపువ్వును పాలతో సహా వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Acne Skin, Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై కూల్ వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని మూడు సార్లు కనుక ప్రయత్నిస్తే అద్భుత ఫలితాలు పొందుతారు.తులసి, పసుపు, కుంకుమ పువ్వు ఆవు పాలు లో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మొటిమలు మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి.చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తిని తగ్గించి మొటిమలకు అడ్డుకట్ట వేస్తాయి.

ఎటువంటి మచ్చలు ఉన్న క్రమంగా వాటిని మాయం చేస్తాయి.మొటిమలు మచ్చలు లేని చర్మాన్ని మీ సొంతం చేశాయి.

అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల సహజంగానే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.వివిధ చర్మ సమస్యలు దరిచేరకుండా కూడా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube