సినీ నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా( Ap Deputy CM ) బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు.
అయితే ఈయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ కూడా తనకు వీలైనప్పుడు పూర్తి చేస్తానని దర్శక నిర్మాతలకు హామీ ఇచ్చారు.ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఏ కార్యక్రమానికి వెళ్లిన అక్కడ కూడా సినిమాల ప్రస్తావనకు వస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పల్లెకు పండుగ( Palleku Panduga ) అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పల్లెకు పండుగ అనే కార్యక్రమంలో భాగంగా పల్లెలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, నీళ్లు వంటి సదుపాయాలు అన్నింటిని కూడా కల్పించబోతున్నారు అయితే ఈ కార్యక్రమంని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఉన్న సమయంలో కొంతమంది అభిమానులు ఓజీ సినిమాకు( OG Movie ) సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇలా అభిమానులు గోల చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం తనకు సినిమాల కంటే తన బాధ్యతే ముఖ్యమని తెలిపారు.ముందు బాధ్యత ఆ తర్వాతే సినిమాలని వెల్లడించారు.ఇక సినిమా ఇండస్ట్రీలో నాకు ఏ హీరోతో పోటీ లేదని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ప్రతి ఒక్క హీరో కూడా ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని, అందుకే నాకు ఎవరితోనో పోటీ లేదని, ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని తెలిపారు.సినిమా ఇండస్ట్రీ బాగుంటేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.