తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలు కూడా ప్రేక్షకులందరిలో ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటు ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ప్రతి హీరో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది.ఇక ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు( Star heroes ) సైతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది.
ముఖ్యంగా గేమ్ చేంజర్( Game changer ), బాలయ్య బాబు 109వ సినిమా, వెంకీ అనిల్ రావిపూడి సినిమాలు మాత్రమే ఇప్పటిదాకా సంక్రాంతి బడిలో ఉన్నాయి.ఇక రీసెంట్ గా సుమంత్ హీరోగా నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమా( Mahendragiri Varahi movie ) కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.
ఇక వీటితోపాటుగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా( Tandel movie ) కూడా సంక్రాంతి బరిలో నిలువబోతున్నట్లు గా తెలుస్తుంది.
నిజానికి ఈ సినిమాని క్రిస్మస్ కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటూ మేకర్స్ ఆలోచిస్తున్నప్పటికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమా తెరకెక్కుతుంది.కాబట్టి అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతుంది.అందుకే అంత తక్కువ గ్యాప్ లో బన్నీకి పోటీగా ఈ సినిమా రిలీజ్ చేయడం ఎందుకని అల్లు అరవింద్ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక దాని వల్ల ఈ సినిమాని సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు.మరి ఇప్పటి వరకైతే సంక్రాంతి బరిలో చాలా సినిమా నిలుస్తున్నాయి.
మరి ఎట్టకేలకు సంక్రాంతి బరిలో ఫైనల్ గా ఏ సినిమాలు నిలుస్తున్నాయి అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది…
.