కంగువ మూవీకి 2000 కోట్ల రూపాయలా.. చెబితే కొంచెమైనా నమ్మేలా ఉండాలిగా!

తమిళ హీరో సూర్య( Surya ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ( Kanguava ).ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

 Kanguva Producer Eppects 2000 Cr Collections, Kanguva, Producer, Collections, Ko-TeluguStop.com

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్( Bollywood ) అలాగే టాలీవుడ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.

తాజాగా కూడా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Kanguva, Kollywood-Movie

నవంబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా విడుదల అయ్యి వందల కోట్ల వసూళ్లు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కవుట్ అయితే వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చేమో.కానీ జ్ఞానవేల్ రాజా ( Gnanavel Raja )మాత్రం ఈ సినిమా ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని అంటున్నాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగువ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగగా.వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు వస్తాయని అన్నాడు జ్ఞానవేల్ రాజా.

కానీ ఈ కామెంట్ నెటిజన్లకు రుచించడం లేదు.

Telugu Kanguva, Kollywood-Movie

ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లా అనిపిస్తోంది.సూర్య సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోనే.కానీ రెండు వేల కోట్లు అంటే మరీ ఓవర్గా లేదు.

బాహుబలి లాంటి సినిమానే 2000 కోట్లు సంపాదించలేకపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏకంగా 2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం అంటే అసాధ్యమే.

అసలు వెయ్యి కోట్ల వసూళ్లయినా సాధిస్తుందా అన్నది చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube