కంగువ మూవీకి 2000 కోట్ల రూపాయలా.. చెబితే కొంచెమైనా నమ్మేలా ఉండాలిగా!
TeluguStop.com
తమిళ హీరో సూర్య( Surya ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ( Kanguava ).
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్( Bollywood ) అలాగే టాలీవుడ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
తాజాగా కూడా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" /
నవంబర్ 14న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా విడుదల అయ్యి వందల కోట్ల వసూళ్లు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కవుట్ అయితే వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చేమో.
కానీ జ్ఞానవేల్ రాజా ( Gnanavel Raja )మాత్రం ఈ సినిమా ఏకంగా రూ.
2 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని అంటున్నాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగువ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగగా.
వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు వస్తాయని అన్నాడు జ్ఞానవేల్ రాజా.
కానీ ఈ కామెంట్ నెటిజన్లకు రుచించడం లేదు. """/" /
ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లా అనిపిస్తోంది.
సూర్య సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోనే.కానీ రెండు వేల కోట్లు అంటే మరీ ఓవర్గా లేదు.
బాహుబలి లాంటి సినిమానే 2000 కోట్లు సంపాదించలేకపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏకంగా 2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం అంటే అసాధ్యమే.
అసలు వెయ్యి కోట్ల వసూళ్లయినా సాధిస్తుందా అన్నది చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్29, ఆదివారం 2024