సింగపూర్‌: ఇద్దరు భారత సంతతి మహిళలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు!!

సింగపూర్‌లో( Singapore ) ఇద్దరు భారత సంతతి మహిళలను ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి.న్యాయ రంగంలో చేసిన సేవలకు గాను జస్టిస్ జుడిత్ ప్రకాష్ (72).

 Indian-origin Singaporean Women Justice Judith Prakash And Shanti Pereira Honour-TeluguStop.com

( Justice Judith Prakash ) సోమవారం ‘‘హర్ వరల్డ్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024’’గా ఎంపికైనట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.నేషనల్ స్ప్రింటర్ శాంతి పెరీరా (28)( Shanti Pereira ) తన క్రీడా ప్రస్థానంలో సాధించిన విజయాలకు గాను ‘‘ హర్ వరల్డ్ యంగ్ ఉమెన్ అచీవర్ అవార్డ్ 2024’’ను అందుకుంది.

Telugu Young Achiever, Indianorigin, Judith Prakash, Awards, Shanti Pereira, Sin

జస్టిస్ ప్రకాష్ .సింగపూర్‌లో మొదటి మహిళా అప్పీల్ జడ్జిగా రికార్డుల్లోకెక్కారు.1992లో సుప్రీంకోర్ట్ బెంచ్‌కు తొలిసారిగా నియమితులయ్యారు.31 ఏళ్ల ప్రస్థానంలో ఆమె సుమారు 645 తీర్పులను వెలువరించారు.వాటిలో సగానికిపైగా ఎంతో ప్రాముఖ్యత కలిగినవని న్యాయ నిపుణులు చెబుతుంటారు.జస్టిస్ ప్రకాష్ కమర్షియల్ లా లోనూ ఎక్స్‌పర్ట్.సింగపూర్‌ను గ్లోబల్ ఆర్బిట్రేషన్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించిన ఇంటర్నేషనల్ ఆర్భిట్రేషన్ యాక్ట్ 1994లో ఆమె ముఖ్య భూమిక పోషించారు.న్యాయ వ్యవస్ధ వైపు సింగపూర్ మహిళలు అడుగుపెట్టడంలో వారికి జస్టిస్ ప్రకాష్ స్పూర్తిగా నిలిచారని ఎస్‌పీహెచ్ మీడియా ప్రశంసించింది.

Telugu Young Achiever, Indianorigin, Judith Prakash, Awards, Shanti Pereira, Sin

ఇక పెరీరా విషయానికి వస్తే.ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో( Paris Olympics ) ఆమె పాల్గొన్నారు.2018 నుంచి 2022 మధ్య పలు అవాంతరాలను ఎదుర్కొన్న పెరీరా ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడ్డారు.అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు.100 మీటర్లు, 200 మీటర్ల పందెంలో పలు జాతీయ రికార్డులు పెరీరా పేరుపై ఉన్నాయి.2023లో జరిగిన ఆసియన్ గేమ్స్‌లో ఆమె 100 మీటర్ల విభాగంలో రజతం, 200 మీటర్ల కేటగిరీలో స్వర్ణం గెలుచుకున్నారు.1974 తర్వాత సింగపూర్‌కు ఇదే మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ గోల్డ్ మెడల్.తన విజయాలతో సింగపూర్‌ యువతులకు పెరీరా రోల్ మోడల్‌గా నిలిచారని ఎస్‌పీహెచ్ మీడియా ప్రశంసించింది.

వీరికి అవార్డులు రావడం పట్ల సింగపూర్‌లోని భారత సంతతి కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube