బిగ్‌బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) కోసం తీసుకొచ్చిన కంటెస్టెంట్లు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ షాక్‌లు ఇస్తున్నారు.పోయినసారి పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth )అనే ఒక మెంటల్ కేసును తీసుకొచ్చి అతడినే విన్నర్ చేశారు.
ఇప్పుడేమో మణికంఠ లాంటి ఓ మెంటల్ పేషెంట్‌ను తీసుకొచ్చి హౌస్ లో పడేశారు.అతడేమో పొద్దస్తమానం సింపతీ కార్డు ఉపయోగిస్తున్నాడు.
అంతేకాదు ఆడవారికి నచ్చకపోయినా వారిని కౌగిలించుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.మణికంఠ ఒక్కడే కాదు గౌతమ్ కూడా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు.
ఇక పృథ్వి( Prithvi ) ధోరణి చూస్తే మనకే మతిపోతుంది. నయని పావని( Nayani Pavani ) కూడా ఏదో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తోంది.శేఖర్ బాషా, ఆకుల సోనియా, సీత, నైనికలు, అభయ్ వంటి కంటెస్టెంట్లు మంచి మెంటల్ కండిషన్‌తోనే ఆడతారు.కానీ ఈ పిచ్చోళ్ల మధ్య ఇమడలేక ఎలిమినేట్ అయిపోతున్నారు.
పృథ్వి పులిహోర కలుపుతూ, సిగరెట్లు తాగుతూ, పిచ్చి కూతలు కూస్తూ చిరాకు పుట్టిస్తున్నాడు.కొంచెం కూడా ఎంటర్టైన్మెంట్ అందించడం లేదు.
ఇన్నిరోజులూ ఇతడు హౌస్ లో ఉండటమే ఒక పెద్ద వింత.ప్రేరణ ఈసారి అతడిని నామినేట్ చేసింది.
దాంతో నయనితో కలిసి పృథ్వి ప్రేరణను టార్గెట్ చేసి ప్రేక్షకులలో ఆగ్రహం తెప్పిస్తున్నాడు.ఒకానొక సమయంలో ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానంటూ పిచ్చి లేచినట్టే వ్యవహరించాడు.
ఇదిలా ఉంటే గంగవ్వ పృథ్విని పారేసింది. “హౌజులో ఆ సిగరెట్లు తాగడం తప్ప నువ్వేం చేస్తున్నవ్.? ఆ నయని కూడా నీలాగే తయారైంది.ఆటలో ఆమెను నాకు అసిస్టెంట్‌గా పెట్టారు కానీ ఆమె నాతో ఉన్నదెక్కడ.?” అని పృథ్విని, నయని పావనిని కడిగేసింది.దాంతో మరింత కోపం తెచ్చుకున్న వీళ్లిద్దరూ ప్రేరణ మీదే ఇంకా విరుచుకుపడుతున్నారు.
నిజాలన్నీ గంగవ్వ చెబితే వాటిని డైజెస్ట్ చేసుకోలేక వీరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
చివరకు నిఖిల్, మణికంఠ కూడా ఆమెకు మద్దతు తెలపకపోవడం కోసమెరుపు.మొదట్లో అందరూ యష్మిని నెగెటివ్ ప్లేయర్ అని విమర్శించారు కానీ ఆమె మాత్రం ప్రేరణకు సపోర్టుగా నిలుస్తూ తన మంచితనాన్ని ప్రదర్శించింది.చివరకు ప్రేరణ వారి టార్చర్ భరించలేక ఏడ్చేసింది.
పృథ్వి మాత్రం ఏమాత్రం కనికరం చూపించలేదు.ఆమెపై పగ పట్టి ఆమె అంతు చూస్తానంటూ ఇంకా రెచ్చిపోయాడు.
ఈసారి ఈ మెంటల్ క్యారెక్టర్ ను ఎలిమినేట్ చేస్తే ఆడియన్స్ చాలా రిలీఫ్ అవుతారు.లేదంటే ఇంకొన్ని రోజులు అతన్ని భరించాల్సిందే.