తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ ఝాన్సీ.( Anchor Jhansi ) కెరీర్ తొలినాళ్లలో సినిమాలలో నటించిన ఈమె తరువాత బుల్లితెరపై యాంకర్‌గా రాణించింది.
ఒకానొక సమయంలో బుల్లితెరపై టాప్ యాంకర్‌గా కొనసాగింది.ఝాన్సీ కెరీర్ పర్సనల్ లైఫ్ వల్ల చాలా దెబ్బతిన్నది.
ఆ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఝాన్సీ యాక్టర్ జోగినాయుడిని( Actor Joginaidu ) ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈ దంపతులకు కుమార్తె కూడా ఉంది.కానీ విభేదాలు రావడం వల్ల వారు విడిపోయి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.జోగి నాయుడుతో తాను హ్యాపీగా లేనని, చాలామంది తమను కలపడానికి ట్రై చేశారని కానీ తాను ఎవరి మాట వినలేదు అని ఆమె చెప్పింది.“సమాజం ఏమనుకున్నా నా తనకు అనవసరం, నేను సంతోషంగా ఉండటమే నాకు అవసరమ”ని ఆమె పేర్కొన్నది.వీరిద్దరికి పుట్టిన కుమార్తె ధన్య( Dhanya ) తన తల్లి ఝాన్సీ వద్దే నివసిస్తోంది.ఒకానొక సమయంలో ఆమె డబ్బులు లేక బస్సు స్టాప్‌లో కూతురు పట్టుకుని కూర్చోవాల్సి వచ్చిందట.
అలాంటి సిచువేషన్ రాకుండా అమ్మాయిలందరూ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలని, స్ట్రాంగ్ గా ఉంటేనే బాగా పోరాటం చేయగలరని ఆమె చెప్పింది.
కోర్టులో డివోర్స్ కేసు( Divorce Case ) నడుస్తున్నప్పుడు ఝాన్సీ ఏ మీడియాతోనూ మాట్లాడలేదు.జోగి నాయుడు మాత్రం మీడియా ముందుకి వచ్చి తన వెర్షన్ వినిపించాడు.ఝాన్సీ మాత్రం మీడియాతో మాట్లాడితే తన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా అని ఓన్లీ కోర్టులో మాత్రమే తన వాదనలు వినిపించింది.
జనాలు ఏమనుకున్నా తనకి అనవసరమని, తనకు కావాల్సింది తనకు దక్కితే చాలని ఆమె వెల్లడించింది.విడాకుల సమయంలో ఫ్యామిలీ తనని అస్సలు ఇబ్బంది పెట్టలేదని, చాలా సపోర్ట్ గా నిలిచిందని కూడా చెప్పుకొచ్చింది.
డివోర్స్ తర్వాత మళ్ళీ తనకు బుల్లితెరపై కో అంటే కోటి వంటి షోలు వచ్చాయని, అవి కూడా తర్వాత పోయాయని, అయినా తాను బాధపడలేదని తెలిపింది.విడాకుల సమయంలో ఆప్తమిత్రులు అనుకున్న కొందరు తనని వెన్నుపోటు పొడిచారని, అప్పుడు చాలా బాధ కలిగిందని అయినా వారిపై పగ తీర్చుకునే తత్వం తనకు లేదని వివరించింది.ఝాన్సీ పదేళ్ల క్రితం విడాకులు తీసుకుంది.ఆమె సినిమా ఇండస్ట్రీలో 9 నంది అవార్డులను అందుకున్నది.జయం మనదేరా, తులసి, సింహ సినిమాల్లో మంచిగా నటించినందుకు కానీ ఈ అవార్డులు దక్కాయి.