టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో దిల్ రాజు( Dil Raju ) ఒకరు.దిల్ రాజు ప్రొడ్యూసర్ గా మారక ముందే ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.
ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత కూడా కొన్ని ఏరియాల థియేటర్ రైట్స్ కొనుగోలు చేసి సినిమాలను ప్రదర్శించేవాడు.దిల్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయనకు బాగా లాభాలు వచ్చాయి.
దీని తర్వాత ఆర్య సినిమా ప్రొడ్యూస్ చేశాడు.అదే సమయంలో జై అనే సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేశాడు.రూ.2.25 కోట్లకు ఆ హక్కులను కొనుగోలు చేస్తే రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయి.20 ఏళ్ల క్రితం అలా ఆయన పాతిక లక్షలు కోల్పోయాడు.
అప్పట్లో పాతిక లక్షలు అంటే మాటలు కాదు.తేజ దర్శకత్వం వహించిన “జై” సినిమా( Jai Movie ) ఓ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది, నవదీప్, సంతోషి, ఆయేషా జుల్కా ఇందులో నటించారు.అయితే ఈ సినిమా వల్ల నష్టపోయిన దిల్ రాజు ఆర్య ( Arya Movie ) వల్ల లాభాలు రావడంతో తట్టుకోగలిగారు.
లేకపోతే ఆయన పరిస్థితి కోలుకోలేని విధంగా మారేదట.ఈ విషయాన్ని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
దిల్ రాజు భద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఫిదా, ఎఫ్2, వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు నిర్మించి కోట్ల రూపాయల లాభాలు అందుకున్నాడు.ఇప్పుడు 450 కోట్లు పెట్టి “గేమ్ ఛేంజర్” సినిమా( Game Changer Movie ) నిర్మిస్తున్నాడు ఈ మూవీ నిర్మాణంలో అల్లు శిరీష్ కూడా పాలుపంచుకుంటున్నాడు.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కానీ శంకర్ భారతీయుడు 2 మూవీ తో ఫ్లాప్ అందుకున్నాడు.అందువల్ల ఈ సినిమా కూడా పోతుందేమో అనే భయం పట్టుకుంది.
దిల్ రాజు ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది.2025 జనవరి 10న సంక్రాంతి కానుక ఈ రామ్ చరణ్( Ram Charan ) మూవీ రిలీజ్ కానుంది.ఒకవేళ దిల్ రాజు అదృష్టం బాగుండి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయితే వందల కోట్లు మిగులుతాయి.
ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఆర్‌ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో హిట్టు కొట్టాడు.మరి రామ్ చరణ్ కూడా అలానే హిట్ సాధిస్తాడా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.