ఆ స్టార్ డైరెక్టర్ కథను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారట.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాత్( Director Puri Jagannath ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూరి ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Puris Story Doesnt Impress Siddhu, Puri Jagannath, Tollywood, Siddhu Jonnala Gad-TeluguStop.com

ఇకపోతే పూరి ఇటీవల తెరకెక్కించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్( Liger, double smart ) లాంటి సినిమాలు డిజాస్టర్ లుగా నిలిచిన విషయం తెలిసిందే.ఇలా ఆయన సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో పూరి జ‌గన్నాధ్ కు మళ్లీ మరోసారి అవకాశం అంటే కాస్త కష్టమే అని చెప్పాలి.

కానీ తప్పదు కదా ప్రయత్నం చేయాల్సిందే.పైగా డబుల్ ఇస్మార్ట్ నష్టాలు అంతో ఇంతో పూడ్చాలి కాబట్టి ప్రస్తుతం అదే ప్రయత్నంలో వున్నారు పూరి.

Telugu Puri Jagannath, Purisstory, Siddhujonnala, Tollywood-Movie

అయితే అందులో భాగంగానే లేటెస్ట్ గా ఒక కథను హీరో సిద్దు జొన్నలగడ్డకు ( Hero Siddu Jonnalagadku )వినిపించారట.నిజానికి పూరి స్టయిల్ అటిట్యూడ్ పాత్రలకు సిద్దు పక్కాగా సరిపోతాడు.అందుకే ఒక కథను ఒకటి రెండు రోజుల క్రితం చెప్పినట్లు తెలుస్తోంది.కానీ ఇప్పటికే జాక్ అనే సినిమా చేస్తున్నాడు సిద్దు.పూరి చెప్పిన కథ దానికి దగ్గరగా వుందని తెలుస్తోంది.అందుకే అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు బోగట్టా.

దాంతో పూరి వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.మరి నెక్స్ట్ సినిమాను కచ్చితంగా సిద్దు జొన్నలగడ్డతో మాత్రమే చేస్తారా లేదంటే ఇతర హీరోలతో చేస్తారేమో చూడాలి మరి.

Telugu Puri Jagannath, Purisstory, Siddhujonnala, Tollywood-Movie

ఇకపోతే పూరి జగన్నాథ్ తెరకెక్కించిన డబుల్ ఇస్మార్ట్ సినిమాను గుడ్డిగా నమ్మి, కోట్లకు కోట్లు పోసి హోల్ సేల్ గా కొన్నారు నిర్మాత నిరంజ‌న్ రెడ్డి.దానికి ఆయన చాలా నష్టపోయారు అన్న విషయం తెలిసిందే.దీన్ని మ్యూచువల్ గా సెట్ చేసుకోవాల్సి వుంది.కానీ తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే తన పాత సినిమాల హక్కులు ఇస్తాను రీ రిలీజ్‌ చేసుకోమని పూరి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కానీ వాటికి నిరంజన్ రెడ్డి అంగీకరించలేదట.మొత్తంగా చూస్తే పూరీ జగన్నాథ్ ప్రస్తుతం కాస్త డేంజర్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది.మరి పూరి జగన్నాథ్ కు నెక్స్ట్ ఏ హీరో అవకాశాన్ని ఇస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube