చుండ్రుతో చింతించొద్దు.. ఒక్క వాష్ లో ఈజీగా వదిలించుకోండిలా!

ఆడ మగ అనే తేడా లేకుండా మనలో చాలా మంది చుండ్రు సమస్య( Dandruff )తో సతమతం అవుతున్నారు.చుండ్రు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

 This Homemade Hair Tonic Helps To Get Rid Of Dandruff Quickly! Homemade Hair Ton-TeluguStop.com

ముఖ్యంగా తలలో విపరీతమైన దురద, జుట్టు పొడిగా మారిపోవడం, జుట్టు కుదుళ్ళు బలహీనపడడం తదితర సమస్యలు తలెత్తుతాయి.అందుకు తోడు దుస్తులుపై చుండ్రు రాలుతుంటే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడానికి రకరకాల షాంపూలు మరియు ఇతర హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

Telugu Dandruff, Dandruff Tonic, Care, Care Tips, Tonic, Healthy, Healthy Scalp,

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై చుండ్రుతో చింతించొద్దు.చాలా ఈజీగా మరియు ఒక్క వాష్ లోనే చుండ్రును వదిలించుకునేందుకు తోడ్పడే అద్భుతమైన హోమ్ రెమెడీ ఉంది.

ఈ రెమెడీని పాటిస్తే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకు( Aloe Vera )ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం ముక్కను పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేయాలి.

Telugu Dandruff, Dandruff Tonic, Care, Care Tips, Tonic, Healthy, Healthy Scalp,

ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసుకున్న కలబంద ముక్కలు, అల్లం ముక్కలతో పాటు ఒక కప్పు ఫ్రెష్ వేపాకు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేస్తే ఒక మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ విధంగా చేస్తే కేవలం ఒక్క వాష్ లోనే చుండ్రు ఆల్మోస్ట్ తొలగిపోతుంది.

ఇంకా మీకు చుండ్రు కనుక ఉంటే మరో రెండు మూడుసార్లు ఈ హోమ్‌ మేడ్ టానిక్ ను ఉపయోగించండి.దాంతో శాశ్వతంగా చుండ్రుకు గుడ్ బై చెప్పవచ్చు.

పైగా ఈ టానిక్ ను వాడటం వల్ల తలలో దురద తగ్గుతుంది.జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.

మరియు హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) సైతం కంట్రోల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube