భారత్‌పై ఆంక్షల దిశగా కెనడా.. మద్ధతు పలికిన భారత సంతతి నేత !!

ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసుతో లింక్ చేస్తూ బురద జల్లేలా కెనడాలోని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ప్రభుత్వం దుందుడుకు చర్యలకు దిగుతోంది.హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మను అనుమానితుల జాబితాలో చేర్చింది.

 Ndps Jagmeet Singh Calls For Sanctions Against India Details, Ndp, Jagmeet Singh-TeluguStop.com

దీంతో భారత్ భగ్గుమంది.పరిస్ధితుల నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma ) సహా కొందరు దౌత్యవేత్తలను వెనక్కి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

Telugu Canadapm, Hardeepsingh, India, India Canada, Indian Canada, Jagmeet Singh

అలాగే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ సహా ఆరుగురు అధికారులను బహిష్కరించాలని డిసైడ్ అయ్యింది.ఈ నెల 19వ తేదీ రాత్రి 11.59 గంటల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది.భారత్ నుంచి ఈ స్థాయిలో ప్రతిస్పందన వస్తుందని ముందే ఊహించిందో లేక మరేదో కానీ కెనడా( Canada ) ఈ అంశాన్ని తెగే దాకా లాగాలని ప్రయత్నిస్తోంది.

దీనిలో భాగంగా భారత్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Canadapm, Hardeepsingh, India, India Canada, Indian Canada, Jagmeet Singh

అటు కెనడాలోని భారత సంతతికి చెందిన నేత, న్యూ డెమొక్రాటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) సైతం భారత్ – కెనడా సంబంధాలు దెబ్బతీసేలా మాట్లాడారు.ఇండియాపై ఆంక్షలు విధించాలని జగ్మీత్ సింగ్ డిమాండ్ చేశారు.కెనడాలో ఆర్ఎస్ఎస్ నెట్‌వర్క్‌పైనా నిషేధం విధించాలని ఆయన కోరారు.

భారత దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయానికి తాను పూర్తి మద్ధతు పలుకుతున్నట్లు జగ్మీత్ సింగ్ స్పష్టం చేశారు.

త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లో ట్రూడోకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.

ఆయన పాపులారిటీ కూడా పాతాళంలోకి పడిపోయింది.గత నెలలో ఎన్‌డీపీ తన మద్ధతును ఉపసంహరించుకోవడంతో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో పడింది.

ట్రూడో, పార్టీ పెద్దలు చాకచక్యంగా వ్యవహరించి పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube