బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటున్నాను.. స్టార్ హీరో సంచలన పోస్ట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.హిందీ,.

 Sudeep Kiccha Announce His Last Season Of Bigg Boss Host, Bigg Boss 11, Kannada,-TeluguStop.com

తమిళం, కన్నడ, తెలుగు భాషలలో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు వెళుతుంది.ఇక ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున( Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం 8వ సీజన్ ప్రసారం అవుతుంది.ఇక తమిళంలో కూడా ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాక ఈ కార్యక్రమానికి విజయ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక హిందీలో సల్మాన్ ఖాన్ కన్నడలో సుదీప్ కిచ్చా( Sudeep kiccha ) వ్యాక్యతగా వ్యవహరిస్తున్నారు.

Telugu Bigg Boss, Kannada, Sudeep, Sudeepkiccha-Movie

ఇక కన్నడలో ఈ కార్యక్రమం 11వ సీజన్ ప్రసారం అవుతుంది.అయితే ఈ కార్యక్రమం గురించి హీరో సుదీప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.తాను బిగ్ బాస్ హోస్ట్ ( Bigg Boss Host ) గా ఇదే ఆఖరి సీజన్ అంటూ ఈయన వెల్లడించారు.

గత పది సంవత్సరాలపాటు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.బిగ్ బాస్ కన్నడ 11కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్.ఈ షోపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు టీవీఆర్ నిదర్శనం.10 సంవత్సరాల పాటు ఈ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది.

Telugu Bigg Boss, Kannada, Sudeep, Sudeepkiccha-Movie

ఇప్పుడు నేను జీవితంలో నా తర్వాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది.బిగ్ బాస్ హోస్ట్ గా ఇదే చివరి సీజన్.బిగ్ బాస్ ఫాలో అవుతున్న వాళ్లు, కలర్స్ వాళ్లు నా ఈ నిర్ణయాన్ని గౌరవిస్తారని అనుకుంటున్నాను.ఈ సీజన్ ను అత్యుత్తమంగా మారుద్దాం.నేను కూడా మీకు సాధ్యమైనంత వినోదాన్ని అందిస్తాను.అందరికీ థాంక్స్ అంటూ సుదీప్ ఈ సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే ఈయన ఉన్నఫలంగా ఈ షో నుంచి తప్పుకోవడానికి గల సరైన కారణం మాత్రం తెలియడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube