పుష్ప 2 ప్రతి సీనుకి దిమ్మ తిరిగి పోవాల్సిందే.. అంచనాలను పెంచేసిన దేవిశ్రీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలను సృష్టించిన అల్లు అర్జున్ ఈ సీక్వెల్ సినిమా ద్వారా డిసెంబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 Devi Sri Prasad Interesting Comments On Pushpa 2 Movie, Devi Sri Prasad, Pushpa-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Devisri, Pushpa, Sukumar-Movie

తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ( Devi sri prasad ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయని చెప్పాలి.ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.పుష్ప 2 అసలు తగ్గేదేలే అనే విధంగా ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే నేను ఫస్ట్ ఆఫ్ చూసాను ప్రతి సీనుకు దిమ్మతిరిగి పోవాల్సిందే అంత అద్భుతంగా సినిమా వచ్చిందని తెలిపారు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Devisri, Pushpa, Sukumar-Movie

ఈ సినిమా షూటింగుకు ముందే సుకుమార్ ( Sukumar ) గారు నాకు ఈ సినిమా కథ చెప్పారు.అప్పుడే చాలా బాగా నచ్చింది ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాని చేశారని దేవి శ్రీ వెల్లడించారు.పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ లా ఉంటుంది.

అడియన్స్ నిరాశ పరిచేలా ఒక్క సీన్ కూడా ఉండదు.ఇక అల్లు అర్జున్ కూడా తన నటనతో విశ్వరూపం చూపించబోతున్నారని ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 సినిమా గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube