చాలామంది హీరోలు సినిమాలను జడ్జ్ చేసే విషయంలో సక్సెస్ అవుతారు.కొన్నిసార్లు మాత్రం ఫ్లాప్ అయ్యే సినిమా హిట్ అవుతుందనుకుంటారు, హిట్ అయ్యే మూవీ ప్లాప్ అవుతుంది భావిస్తారు.
వదులుకోవాల్సిన సినిమాలకు సైన్ చేసే, చేయాల్సిన సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు దీని వల్ల వారు బాగా నష్టపోతుంటారు అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐదుగురు హీరోలు తన వద్దకు వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేశారు.వాళ్లు ఎవరో, వారు రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
* రామ్ చరణ్ – ఓకే బంగారం
తమిళ్ రొమాంటిక్ ఫిలిం “ఓకే బంగారం”( OK Bangaram ) సినిమా రూ.6 కోట్లతో తీస్తే రూ.56 కోట్లు కలెక్ట్ చేసింది.ఈ సినిమాని చెర్రీ కొద్దిలో మిస్ చేసుకున్నాడు.2014లో మణిరత్నం మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని( Ram Charan ) సంప్రదించి ఈ మూవీ కథ వినిపించారు.ఇందులో హీరో క్యారెక్టర్ చేయాలని కోరారు.
కానీ ఆ హీరో రోల్ తనకు సూట్ కాదని రామ్ చరణ్ దాన్ని రిజెక్ట్ చేశాడు.కట్ చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దుల్కర్ సల్మాన్ హీరో పాత్ర దక్కించుకున్నాడు.ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్.
సినిమా స్టోరీ విని ఆరెంజ్ లాగానే అది కూడా ప్లాప్ అవుతుందని రామ్ చరణ్ భయపడ్డాడు.అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు.
* జూనియర్ ఎన్టీఆర్ – ఆర్య
సుకుమార్ బన్నీ కాంబినేషన్లో వచ్చిన ఆర్య మూవీ( Arya Movie ) అంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు బన్నీ ఈ సినిమా తర్వాతనే స్టార్ హీరోగా మారాడు అయితే ఇందులో జూ.ఎన్టీఆర్ ని( Jr NTR ) హీరోగా తీసుకోవాలని సుకుమార్ బాగా ప్రయత్నించాడు కానీ తారక్ ఎందుకో గానీ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించలేదు.బహుశా ఈ సినిమా తనకి సెట్ కాదని అతను అనుకుని ఉండొచ్చు.
• నాగచైతన్య – అ, ఆ!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగచైతన్య( Naga Chaitanya ) కలిసి చేసిన అ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఈ మూవీ ముందుగా నాగచైతన్య వద్దకు వెళ్లిందట.అయితే అతను వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీని తిరస్కరించాల్సి వచ్చింది.దీన్ని ఒప్పుకొని ఉంటే నాగచైతన్య కెరీర్‌కు చాలా ప్లస్ అయ్యుండేది.
• మహేష్ బాబు – ఏ మాయ చేశావే
గౌతమ్ మీనన్ మొదటగా ఈ సినిమాలో హీరో రోల్ మహేష్‌కే( Mahesh Babu ) ఇచ్చాడు.కానీ ఇది చాలా సాఫ్ట్ మూవీ అని, తాను చేయడం కుదరదని దీనిని రిజెక్ట్ చేశాడు.
• రామ్ చరణ్ – స్నేహితుడు
విజయ్ దళపతి హీరోగా నటించిన “స్నేహితుడు” సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.శంకర్ ఈ సినిమాలో రామ్ చరణ్ ను హీరోగా ఎంపిక చేసుకున్నాడు.కానీ దానికి డేట్స్ అడ్జస్ట్ కాలేక చెర్రీ రిజెక్ట్ చేశాడు.