గత కొద్దిరోజులుగా తెలంగాణ క్యాబినెట్( Telangana Cabinet ) విస్తరణ పై జోరుగా చర్చ జరుగుతుంది.ఇప్పటికే అనేసార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కాంగ్రెస్ అధిష్టానం పెద్దల వద్ద మంత్రివర్గ విస్తరణ పైన చర్చించారు.
ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అనే విషయం పైన అధిష్టానం పెద్దల నిర్ణయం ఏంటో తెలుసుకున్నారు. మంత్రి కొండ సురేఖ( Minister Konda Surekha ) వరుసగా వివాదాలలో చిక్కుకోవడంతో ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్టోబర్ 17న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు.ఇటీవల కొత్తగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ( Congress Party ) జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు .

ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణ పైన అధిష్టానం పెద్దలతో మరోసారి చర్చించబోతున్నట్లు సమాచారం .వాస్తవంగా దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరిగినా, ఆ నిర్ణయం వాయిదా పడింది. ఇప్పటికే హర్యానా, జమ్ము కాశ్మీర్ ఎన్నికల తంతు పూర్తి కావడంతో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ పై అధిష్టానం పెద్దలు ఫోకస్ పెట్టినట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది.ఇదే విషయంపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ని ఢిల్లీకి అధిష్టానం పెద్దలు పిలిపించినట్లు తెలుస్తోంది .

ఈ పర్యటనలతో మంత్రి వర్గ విస్తరణ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.ఈ బుధవారం సాయంత్రం రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం కాబోతున్నట్లు సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, కొండ సురేఖ వ్యవహారం పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది.కొండా సురేఖ వ్యవహారం పై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కొంతమంది ఫిర్యాదులు చేయడం , ఈ విషయంలో అధిష్టానం పెద్దలు అసంతృప్తితో ఉండడంతో ఆమెను తప్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు గా సంకేతాలు వెలువడుతున్నాయి.