డొనాల్డ్ ట్రంప్‌ హత్యకు కుట్ర.. ఇరాన్‌కు అమెరికా అల్టీమేటం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పలు ర్యాలీలలో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )భద్రత అంశం చర్చనీయాంశంగా మారింది.పెన్సిల్వేనియాలోని బట్లర్‌తో మొదలుకుని నిన్నటి ఘటన వరకు ఆయన పలుమార్లు తృటిలో తప్పించుకున్నారు.

 Us Govt Warns Iran Over Threats Against Ex President Donald Trump , Donald Trum-TeluguStop.com

ఈ నేపథ్యంలో అమెరికా అధినాయకత్వం అప్రమత్తమైంది.ట్రంప్‌కు ఏం జరిగినా దానిని అమెరికాపై దాడిగానే పరిగణిస్తామని ఇరాన్‌ను అగ్రరాజ్యం హెచ్చరించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ట్రంప్‌ కదలికలు, భద్రత తదితర వివరాలను అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) ఎప్పటికప్పులు అధికార యంత్రాంగం ద్వారా గమనిస్తున్నారు. ఇరాన్ హిట్ లిస్ట్‌లో ట్రంప్ ఉండటంతో వాటిని తిప్పికొట్టేలా ఫోకస్ చేయాలని అధికారులను బైడెన్ అప్రమత్తం చేశారు.

అయితే అమెరికా అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని ఇరాన్ తేల్చిచెప్పింది.కానీ అగ్రరాజ్యమే దశాబ్ధాలుగా తమ విషయాల్లో వేలు పెడుతోందని టెహ్రాన్( Tehran ) ఆరోపించింది.

Telugu Baghdad Airport, Donald Trump, Qudsforce, Tehran, Warns, Warnsiran-Telugu

2020లో ఇరాన్‌ సాయుధ బలగాలలో శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్ చీఫ్‌ ఖాసీం సులేమానీని ( Quds Force Chief Qasem Soleimani )హతమార్చేందుకు నాటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.అధ్యక్షుడి ఆదేశాలతో 2020 జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్ధాద్‌ ఎయిర్‌పోర్ట్ ( Baghdad Airport )నుంచి బయటికి వస్తున్న సులేమానీ కాన్వాయ్‌పై డ్రోన్‌తో దాడి చేసిన యూఎస్ మిలటరీ అతనిని హతమార్చింది.ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.సులేమానీ హత్యకు అమెరికా మూల్యం చెల్లించకతప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు.

Telugu Baghdad Airport, Donald Trump, Qudsforce, Tehran, Warns, Warnsiran-Telugu

కాగా.ట్రంప్‌కు పొంచి ఉన్న ముప్పుకు సంబంధించి తమకు సమాచారం ఉందని సీక్రెట్ సర్వీస్ అధికారి ఒకరు గతంలో తెలిపారు.ట్రంప్‌తో పాటు ఆయన హయాంలో వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అధికారులను ఇరాన్ టార్గెట్ చేసిందని ఆయన వెల్లడించారు.అయితే తాము అలర్ట్‌గానే ఉన్నామని, ఎలాంటి పరిస్ధితినైనా ఎదుర్కొంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube