స్టార్ హీరో బన్నీ ( Star Hero Bunny )ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా పవన్ ఫ్యాన్స్ బన్నీ సినిమాను టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
పుష్ప2( Pushpa2 ) డిసెంబర్ నెల 6వ తేదీన రిలీజ్ కానుంది.మైత్రీ నిర్మాతలు ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు ఏకంగా 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది.
బన్నీ ఇదే సమయంలో అన్ స్టాపబుల్ సీజన్4( Unstoppable Season 4 ) షోకు హాజరు కానున్నారు.అన్ స్టాపబుల్ షోలో బన్నీ ఏం చెబుతారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
పవన్ అభిమానులను కూల్ చేసే విధంగా బన్నీ ఆసక్తికర విషయాలను చెప్పే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని తెలుస్తోంది.బాలయ్య షోలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
![Telugu Aha Ott, Allu Arjun, Bunny Hot Topic, Pushpa, Bunny, Tollywood-Movie Telugu Aha Ott, Allu Arjun, Bunny Hot Topic, Pushpa, Bunny, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/bunny-comments-become-hot-topic-in-social-media-details-inside-goes-viralb.jpg)
వాస్తవానికి అల్లు అర్జున్( Allu Arjun ) ఇప్పటికే షోకు ఒకసారి హాజరయ్యారు.అదే సమయంలో ఆహా ఓటీటీ ( Aha OTT )బన్నీ సొంత ఓటీటీ అనే సంగతి తెలిసిందే.అందువల్ల బన్నీ అన్ స్టాపబుల్ షోకు హాజరైతే ఈ షో రేంజ్ కచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.బాలయ్య సైతం ఈ షోను ఒకింత గ్రాండ్ గా ప్లాన్ చేశామని చెబుతున్న సంగతి తెలిసిందే.
అన్ స్టాపబుల్ సీజన్ 4 సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటునారు.
![Telugu Aha Ott, Allu Arjun, Bunny Hot Topic, Pushpa, Bunny, Tollywood-Movie Telugu Aha Ott, Allu Arjun, Bunny Hot Topic, Pushpa, Bunny, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/10/bunny-comments-become-hot-topic-in-social-media-details-inside-goes-viralc.jpg)
అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉందనే సంగతి తెలిసిందే.బన్నీ ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను ఎన్నో రెట్లు పెంచుకోవడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు.అక్టోబర్ 24వ తేదీ నుంచి అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఈ షో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.