పబ్లిక్ లో కుటుంబం ముందే యువకుడిని కొట్టి హతమార్చిన గ్యాంగ్..(వీడియో)

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న విషయానికి బహిరంగ ప్రదేశాలలో గొడవలకు పాల్పడుతున్న సంఘటనలు మనం చాలానే చూసాము.అలాంటి సంఘటన ఒకటి ముంబైలో( Mumbai ) చోటు చేసుకుంది.

 Man Beaten To Death For Overtaking Auto Rickshaw In Mumbai Viral Video Details,-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఓవర్‌ టేక్ చేసే విషయంలో ఒక చిన్న పాటి ఘర్షణ ఆకాష్( Akash ) అనే వ్యక్తి పాలిట శాపంగా మారింది చివరకు అతడు మృతి చెందాడు.

ఈ ఘర్షణలో భాగంగా ముంబైలోని దిండోషి పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.వీరి అందరినీ కూడా కోర్టులో హాజరు పరచగా వారందరికీ అక్టోబర్ 22 వరకు పోలీస్ కస్టడీ విధించింది.

ఇక బాధితుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేవ సభ్యుడు మల్లాది ఈస్ట్ లో ఆటో రిక్షా డ్రైవర్ తో( Auto Rickshaw Driver ) గొడవపడ్డాడు.

అనంతరం ఒక గుంపు యువకుడు పై దాడి చేయడంతో అతను మృతి చెందాడు.అతడిని కాపాడడానికి తన భార్య కూడా ప్రయత్నం చేయగా ఆమెను కూడా కొట్టడంతో గర్భస్రావం కూడా జరిగింది.అంతేకాకుండా ఈ క్రమంలో ఆకాష్ తండ్రి కూడా అక్కడే ఉన్నాడు.

అతడిని కాపాడే క్రమంలో తండ్రికి కూడా కంటికి గాయం అయినట్లు తెలుస్తుంది.కుటుంబ సభ్యుల ముందే ఆకాశం కొట్టి చంపిన దృశ్యాలు మనం వీడియోలో చూడవచ్చు.

గుంపు నుండి అతని కాపాడేందుకు అతని భార్య ఆకాష్ మీద పడుకున్నాట్టు కూడా మనం చూడవచ్చు.

అంతే కాకుండా ఈ తరుణంలో ఒక వృద్ధుడు ప్రజలకు క్షమాపణలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు.బైకును( Bike ) ఓవర్ టేక్ చేయడం పై ఆటో రిక్షా డ్రైవర్ కు గొడవ మొదలైందని మొదట్లో వారిద్దరు చాలా విషయాలు మాట్లాడుకున్నారని కొద్దిసేపటికి వివాదం చాలా పెద్దగా అయ్యిందని.ఇతర ఆటో రిక్షా డ్రైవర్లు కూడా గొడవకు దిగారు.

వివాదం కాస్త ఎక్కువగా అవ్వడంతో యువకుడిని దారుణంగా కొట్టారు.ఈ క్రమంలో యువకుడు పరిస్థితి విషమించడంతో నిందితులందరూ పారిపోగా.

వెంటనే బాధితుడుని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube