పార్టీలో కలహాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ .. ఆ వ్యాఖ్యలపై హెచ్చరిక 

దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకత పెరుగుతోందని, అదే సమయంలో కాంగ్రెస్( Congress ) కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నారు.ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుండడం బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ తమ ఇండియా కూటమిలో( India Alliance ) ఉండడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు పై కాంగ్రెస్ అధిష్టానం నమ్మకంతో ఉంది .

 Congress High Command Focus On Internal Issues In India Alliance Details, Congre-TeluguStop.com

అదే సమయంలో పార్టీలోనే అంతర్గత కలహాలు కారణంగా , గెలిచే అవకాశం ఉన్నచోట కూడా ఓటమి ఎదుర్కోవాల్సి వస్తోందని,  ఈ పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది.ఈ మేరకు అన్ని రాష్ట్రాల పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేసింది.

ముఖ్యంగా మహారాష్ట్ర,  ఝార్ఖండ్ లలో అంతర్గత కలహాలు కారణంగా ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి దిశా నిర్దేశం చేసింది.

Telugu Aicc, Congress, Haryana, India Alliance, Rahul Gandhi, Sonia Gandhi-Polit

ఇటీవల హర్యానా ఎన్నికల్లో( Haryana Elections ) కాంగ్రెస్ ఓటమికి అంతర్గత కలహాలే కారణం అని ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది .సొంత పార్టీలోని పరిస్థితులను చక్కదిద్దుకోవాలని నిర్ణయించింది .ముఖ్యంగా పార్టీ సహచరులపై ఇండియా కూటమిలోని ఇతర నేతలపైన బహిరంగంగా ఎటువంటి విమర్శలు చేయవద్దని గట్టిగానే హెచ్చరించింది.  ఈ విషయంలో తేడా వస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడబమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,( Mallikarjuna Kharge ) మరో కీలక నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హెచ్చరించారు. 

Telugu Aicc, Congress, Haryana, India Alliance, Rahul Gandhi, Sonia Gandhi-Polit

పార్టీ  అంతర్గత సమావేశంలో వీటి పై క్లారిటీకి ఇచ్చారు.  ఇండియా కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని,  ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీకి చెందిన వారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడం ఇప్పటివరకు కూటమిలో ఆనవాయితీగా వస్తుంది.ప్రస్తుత మహారాష్ట్రలో విపక్షంలో అతిపెద్ద పార్టీగా ఉన్నందువల్ల సీఎం పీఠం తమకే దక్కాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

  ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు తాము రేసులో ఉన్నామంటూ సంకేతాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube