కౌశిక్ గాంధీ వివాదం ! డిజిపి కి రేవంత్ కీలక ఆదేశాలు

గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ( Arikepudi Gandhi ) వ్యవహారం ఇంకా రచ్చరచ్చగానే ఉంది.ప్రస్తుతం ఈ ఇద్దరి చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.

 Padi Koushik Arekepudi Gandi Controversy! Revanth Key Orders To Dgp, Padi Koush-TeluguStop.com

నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లడం, ధర్నాకు దిగడం వంటివన్నీ చోటుచేసుకోగా,  నేడు టిఆర్ఎస్ కూడా ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగింది.ఈ వ్యవహారం తెలంగాణలో శాంతిభదతలకు విగాతం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు .ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై రేవంత్ రెడ్డి స్పందించారు.రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే బాధతో కొందరు శాంతిభద్రతలకు విగాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రకరకాల కుట్రలకు తెరతీస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డిజిపి కి రేవంత్ రెడ్డి సూచించారు.

Telugu Arekepudi Gandi, Congress, Telangana, Ts-Politics

ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం పోలీస్ యంత్రాంగంపై ఆయన పూర్తి రివ్యూ చేయబోతున్నారు.  శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి విషయంలో వెనక్కి తగ్గవద్దని,  కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 

Telugu Arekepudi Gandi, Congress, Telangana, Ts-Politics

హైదరాబాద్,  తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించవద్దని , వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.అరికెపూడి గాంధీ,  పాడి కౌశిక్ రెడ్డి మధ్య చోటుచసుకున్న వివాదం రోజురోజుకు ముదురుతుండడం, రాజకీయ రచ్చకు తెరలేపడం , శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులను  ఈ విషయంలో సీరియస్ గా ఉండాలని , శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలని రేవంత్ ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube