సీజన్ మారింది అంటే చాలు రకరకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.అందులో గొంతు నొప్పి( Sore Throat ) కూడా ఒకటి.
ఈ సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వేధిస్తుంటుంది.అనేక వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గొంతు నొప్పికి కారణమవుతాయి.
అలాగే కాలుష్యం, పొగ, ధూళికి ఎక్కువగా గురికావడం వల్ల గొంతు నొప్పి వస్తుంది.దాంతో గొంతు బొంగురు పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు మెడ చుట్టూ వాపు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.గొంతు నొప్పి కారణంగా తినడానికి, తాగడానికి, చివరకు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.
మిమ్మల్ని కూడా గొంతు నొప్పి వేధిస్తుందా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు గొంతు నొప్పి నుంచి త్వరగా బయటపడడానికి అద్భుతంగా తోడ్పడతాయి.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ కూడా ఆ కోవకే చెందుతుంది.అందుకోసం ముందుగా అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక అల్లం తురుము వేసుకోవాలి.అలాగే అంగుళం దాల్చిన చెక్కను( Cinnamon ) ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి.వీటితో పాటు నాలుగు దంచిన మిరియాలు వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె( Pure Honey ) కలిపితే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ డ్రింక్ ను తీసుకుంటే గొంతు నొప్పి పరారవుతుంది.ఈ డ్రింక్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.ఇవి గొంతు నొప్పికి కారణమయ్యే వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల తో పోరాడతాయి.
గొంతు నొప్పి సమస్యను దూరం చేస్తాయి.అదే సమయంలో జలుబు, దగ్గు వంటి వాటికి కూడా ఈ డ్రింక్ చెక్ పెడుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను తొలగిస్తుంది.కఫాన్ని కరిగిస్తుంది.
కాబట్టి గొంతు నొప్పితో సతమతం అవుతున్నవారు ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.