కమలా హారిస్ మాకెందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు .. టైమ్ మ్యాగజైన్ యజమాని అక్కసు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నారు కమలా హారిస్ – డొనాల్డ్ ట్రంప్(Kamala Harris – Donald Trump).ఎన్నికలకు ఎన్నో రోజులు సమయం లేకపోవడంతో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వారిద్దరూ విడిచిపెట్టడం లేదు.

 Time Magazine Owner Fires On Kamala Harris For Refusing Interview, Time Magazine-TeluguStop.com

తన జీవితంలో చివరి ఎన్నికలు కావడంతో ట్రంప్ కూడా వయసును కూడా పక్కనబెట్టి మరి ప్రచారంలో పాల్గొంటున్నారు.కమలా హారిస్ అమెరికన్ (American)మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ దేశ ప్రజలకు తన ప్రణాళికలు వివరిస్తున్నారు.

అయితే ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్‌తో ఆమె ఇప్పటి వరకు మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది.దీనిపై ఆ సంస్థ యజమాని స్పందించారు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఎన్నోసార్లు తాము కమలా హారిస్(Kamala Harris) ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా.ఆమె తిరస్కరించారని టైమ్ మ్యాగజైన్ అధిపతి మార్క్ బెనియోఫ్ (Marc Benioff)తెలిపారు.

తాము పారదర్శకతను విశ్వసిస్తామని, ప్రతి ఇంటర్వ్యూను పూర్తిగా ప్రచురిస్తామని ఆయన వెల్లడించారు.వైస్ ప్రెసిడెంట్ అదే స్థాయిలో ప్రజలతో ఎందుకు మమేకం కావడం లేదని బెనియోఫ్ ప్రశ్నించారు.

Telugu American, Donald Trump, Kamala Harris, Marc Benioff, Podcast Daddy, Shows

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)రెండు ఇంటర్వ్యూలలో 90 నిమిషాల పాటు టైమ్‌కి సమయం కేటాయించారని రచయిత షార్లెట్ ఆల్టర్ తన కథనంలో ప్రస్తావించారు.అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే ముందు అధ్యక్షుడు బైడెన్ కూడా టైమ్‌తో మాట్లాడాడని గుర్తుచేశారు.కమలా హారిస్ ఎక్కువగా స్థానిక మీడియా, లోకల్ పాడ్ కాస్ట్, ఫ్రెండ్లీ టాక్ షోలను ఇష్టపడుతున్నారని ఆల్టర్ తన కథనంలో రాశారు.

Telugu American, Donald Trump, Kamala Harris, Marc Benioff, Podcast Daddy, Shows

టైమ్ పలు రకాలుగా ప్రయత్నించినప్పటికీ.మ్యాగజైన్‌తో మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని హారిస్ స్పష్టం చేయడం గమనార్హం.దీనికి బదులుగా ది వ్యూ, పోడ్‌కాస్ట్ కాల్ హర్ డాడీ, ది హోవార్డ్ స్టెర్న్ షో , ది లేట్ షో విత్ స్టీఫెన్ కోల్‌బర్ట్ (The View, podcast Call Her Daddy, The Howard Stern Show, The Late Show with Stephen Colbert)వంటి షోలలో కనిపించడానికే ఆమె ఇష్టపడుతున్నారు.

కమలా హారిస్ ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వనప్పటికీ.డెమొక్రాట్లకు అనుకూలంగా టైమ్ తన కథనాలను ఇస్తోందని విమర్శలను ఎదుర్కోవడం కొసమెరుపు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube