డబ్బులు ఉంటేనే ఈరోజుల్లో బ్రతుకుతాం.. చలాకీ చంటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి( Jabardast Comedian Chalaki Chanti ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు చంటి.

 Comedian Chalaki Chanti Interview Latest, Chalaki Chanti, Tollywood, Jabarsth, H-TeluguStop.com

అలాగే సినిమాలో కూడా చిన్న చిన్న పాత్రలు పోషించి మరింత గుర్తింపును తెచ్చుకున్నారు.ఆ తర్వాత కొన్నేళ్లపాటు జబర్దస్త్ కి దూరమైన విషయం తెలిసిందే.

ఆపై బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు చంటి.ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabarsth, Tollywood-Movie

ఇకపోతే గత ఏడాది గుండె పోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటి కొచ్చేశాడు.గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇతడు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిపారు.కాగా ఈ సందర్బంగా చంటి మాట్లాడుతూ.నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరూ హెల్ప్ చేయలేదు.కనీసం పలకరించలేదు కూడా.

కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారు అంతే.నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు.

డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాము.

Telugu Chalaki Chanti, Chalakichanti, Jabarsth, Tollywood-Movie

డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు.ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే.ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు.

కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు.మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు.

ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు అని చంటి చెప్పుకొచ్చాడు.హెల్త్ బాగో లేకపోవడంతో చంటి మరీ దారుణంగా తయారయ్యాడు.

కాస్త బక్క చిక్కిపోయి చిన్నగా కనిపిస్తున్నాడు చంటి.ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చంటి అభిమానులు చంటి త్వరగా కోలుకోవాలని వీలైనంత తొందరగా మళ్ళీ కామెడీ స్టార్ట్ చేయాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube