ఈమెకి డ్రాకులా లాగా ఆ డిసీజ్ ఉందంట.. వెల్లుల్లి తింటే..?

ఈ ప్రపంచంలో చాలామంది చాలా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు.ఆ వ్యాధుల కారణంగా వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇటీవల ఒక మహిళ తనకు డ్రాకులా లాగా వ్యాంపైర్ డిసీజ్ వచ్చిందని ఆరోపిస్తోంది.

 Woman Claims She Has vampire Disease Like Dracula, Phoenix Nightingale, Acute I-TeluguStop.com

వ్యాంపైర్ అంటే సమాధిలో నుంచి లేచి వచ్చి ప్రజల రక్తాలని తాగే ఒక దెయ్యం.ఇలాంటి పిశాచాలకి వచ్చే వ్యాధి తలుపు వచ్చిందని ఆమె చెబుతోంది.

మిన్నెసొటాకు చెందిన ఈ మహిళ పేరు ఫీనిక్స్ నైటింగేల్ (32)( Phoenix Nightingale, ) ఆమె చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధి గురించి ప్రజలందరికీ తెలియజేయాలని ప్రయత్నిస్తోంది.

Telugu Acute Porphyria, Dracula, Garlic, Minnesota, Sulphur Allergy, Vampire, Vl

ఈమె వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ అనే పదార్థం తింటే అలర్జీ లేస్తుందట.వెల్లుల్లి తనకు ఒక విషయం లాంటిదని ఆమె చెబుతోంది.ఈ వ్యాధిని “అక్యూట్ ఇంటర్‌మిటెంట్ పోర్ఫిరియా” అని కూడా అంటారు.

ఈ వ్యాధి వల్ల చాలా తీవ్రమైన నొప్పులు, మైగ్రేన్, మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.ఈ వ్యాధి గురించిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనికి పాపులర్ డ్రామా డ్రాకులాతో సంబంధం ఉంది.

డ్రాకులా( Dracula ) కథకు స్ఫూర్తిగా ఉన్న వ్లాడ్ III అనే వ్యక్తికి ఈ రకమైన వ్యాధి ఉండేదని కొందరు భావిస్తున్నారు.ఫీనిక్స్ నైటింగేల్ వెల్లుల్లిని చూసి చాలా భయపడుతుంది ఆమె సూర్యకాంతిని కూడా చూడలేదట, చర్మం సైతం తెల్లగా మారింది.

చిగుళ్లు కూడా దెబ్బతిన్నాయి.అంతేకాదు, ఈ వ్యాధి మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది.

దీని వల్ల కొంతమంది ఈమెలాంటి వ్యాధి ఉన్న వారిని ‘రాక్షసులు’ లేదా ‘శాపగ్రస్తులు’ అని అనుకుంటారు.

Telugu Acute Porphyria, Dracula, Garlic, Minnesota, Sulphur Allergy, Vampire, Vl

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ ( Sulphur )ఈమెకు చాలా హాని చేస్తుంది.కొంచెం వెల్లుల్లి తింటే కూడా, ఈమెకు కొన్ని రోజుల పాటు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.అందుకే, ఈమె ఏదైనా ఆహారం తినే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈ వ్యాధి వల్ల ఆమె జీవితం చాలా కష్టంగా మారింది.దీని గురించి తెలుసుకోవడానికి ఆమె చాలా కష్టపడింది.

తన జీవితంలో 480 సార్లు ఈ వ్యాధి బాధను అనుభవించింది.ఈ వ్యాధి వల్ల వచ్చే నొప్పి ప్రసవ వేదన కంటే ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పింది.

ఒకసారి ఈ వ్యాధి బాధ 40 గంటలు కొనసాగింది.ఆ సమయంలో ఆమెకు నిరంతరం వాంతులు అవుతూనే ఉన్నాయి.

చాలా బలహీనంగా అయిపోయి, మూర్ఛ పోయింది.ఎర్ర ద్రాక్ష, సోయా, మద్యం, కాఫీ వంటి సల్ఫర్ రిచ్ ఆహారాలను కూడా ఆమె తినకూడదు.“మెనులో ఏది తినొచ్చు, ఏది తినకూడదు అని చూడాలంటే నాకు కన్నీళ్లు వస్తాయి” అని ఆమె చెప్పింది.ఈవిడ గురించి తెలుసుకుని చాలామంది అయ్యో పాపం అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube