విశ్వంభర ట్రోల్స్ విషయంలో దిద్దుబాటు జరుగుతుందా.. ఆ తప్పులు చేస్తే ఇబ్బందే!

వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర( vishwambara ).భారీ అంచనాల నడుమ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Will Makers Work On Vishwambara Vfx, Vishwambara, Vishwambara Teaser, Vfx, Tolly-TeluguStop.com

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి అయ్యిందని కేవలం ఒక పాట మాత్రమే ఉంది అని దర్శకుడు ఇటీవల తెలిపారు.

ఇకపోతే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇక టీజర్ లో చిరంజీవి లుక్ బాగా నచ్చింది.

Telugu Chiranjeevi, Tollywood, Vishwambara-Movie

కానీ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పై ( visual effects )ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి.వీఎఫ్ఎక్స్ చీప్‌గా( VFX ) ఉన్నాయ‌ని, చుట్టేసిన ఫీలింగ్ క‌లుగుతోంద‌ని, ఇప్పుడున్న పోటీని త‌ట్టుకోవాలంటే ఈ ఎఫెక్ట్ స‌రిపోద‌ని మెజారిటీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.లాప్‌టాప్‌ ల‌లో, సెల్ ఫోన్ల‌లో చూస్తే ఓకే గానీ, పెద్ద తెర‌పై టీజ‌ర్ చూస్తే, చాలా స్ప‌ష్ట‌మైన తేడాలు క‌నిపిస్తున్నాయి.కొంద‌రైతే హాలీవుడ్ సినిమాల విజువ‌ల్స్ ని కాపీ కొట్టారంటూ, సాక్ష్యాల‌తో స‌హా చూపిస్తున్నారు.

అయితే నిజం చెప్పాలంటే వీఎఫ్ఎక్స్ పై చిత్ర‌బృందం ఎక్కువ స‌మ‌య‌మే కేటాయించిందట.అంతే కాకుండా అందుకోసం భారీగా కూడా ఖ‌ర్చు పెట్టిందట.

అయినా ఫ‌లితం క‌నిపించ‌లేదట.కాక‌పోతే విశ్వంభ‌ర టీమ్ ముందు త‌గిన స‌మ‌యం ఉంది.

Telugu Chiranjeevi, Tollywood, Vishwambara-Movie

ఈ విజువ‌ల్స్ పై రీ వ‌ర్క్ చేసే అవ‌కాశం ఉంది.సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది.ఇప్పుడు వేస‌వికి షిఫ్ట్ అయ్యింది.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.

కాబ‌ట్టి చేతిలో త‌గిన స‌మ‌యం ఉంది.వీఎఫ్ఎక్స్ ని మార్చి, కొంత క్వాలిటీ తీసుకొచ్చేలా చిత్ర‌బృందం ప్ర‌య‌త్నించవచ్చు.

ఆదిపురుష్‌ విష‌యంలో ఇదే జ‌రిగింది.టీజ‌ర్ చూసి అంతా మొహాలు తేలేశారు.

టీజ‌ర్‌కి వ‌చ్చిన స్పంద‌న చూసిన చిత్ర‌బృందం దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకొంది.వీఎఫ్ఎక్స్ లో కొన్ని షాట్స్ మార్చింది.

ఇప్పుడు విశ్వంభ‌ర‌ కూ ఆ ఛాన్స్ వుంది.సినిమా మొత్తం విజువ‌ల్ ఎఫెక్ట్స్ పై ఆధార‌ప‌డి ఉన్న నేప‌థ్యంలో క్వాలిటీ విష‌యంలో రాజీ ప‌డితే మొద‌టికే మోసం వ‌స్తుంది.

ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ విష‌యంపై కాస్త సీరియ‌స్ గా ఫోక‌స్ పెడితే మంచిది.మరి వీఎఫ్ఎక్స్ విషయంలో విశ్వంభర మూవీ మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube