యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(junior ntr ) నటించిన దేవర (Devara)మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే లాభాలను అందించింది.ఈ సినిమాకు ఇప్పటివరకు 57 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.
దేవర మూవీ లాభాల లెక్క ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.భారీ లాభాలను అందించిన టాప్ 10 సినిమాల్లో దేవర మూవీ టాప్7 ప్లేస్ లో ఉండటం గమనార్హం.
బాహుబలి2, బాహుబలి1, కలికి, ఆర్.ఆర్.ఆర్.హనుమాన్, అల వైకుంఠపురములో(Baahubali 2, Baahubali 1, Kaliki, R.R.R.Hanuman, in Ala Vaikunthapuram)సినిమాలు బిజినెస్ తో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం లాభాలను అందించిన సినిమాల జాబితాలో ఉన్నాయి.దేవర తర్వాత భారీ లాభాలను అందించిన సినిమాల జాబితాలో గీతా గోవిందం, ఎఫ్2, వాల్తేరు వీరయ్య(Geetha Govindam, F2, Waltheru Veeraiah) సినిమాలు ఉన్నాయి.
దేవర సినిమా మంచి లాభాలను అందించి టాప్7 లో నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
దేవర మూవీ రాబోయే రోజుల్లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలు కావడంతో ఈ సినిమా మరీ భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం సులువైన విషయం అయితే కాదు.దేవర కలెక్షన్లు(Devara Collections) ఫేక్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నా ఆ కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల విషయంలో నిర్మాతలు ఎంతగానో సంతోషిస్తున్నారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.దేవర సినిమాకు ప్రస్తుతం పెద్దగా పోటీ అయితే లేదని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.దేవర సినిమా సెకండాఫ్ అద్భుతంగా ఉంటే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని మాస్ సినిమాల్లో నటించే ఛాన్స్ ఉంది.