తెలంగాణ మంత్రి కొండ సురేఖ ( Konda Surekha )దూకుడు వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది.సురేఖ దూకుడుతో కాంగ్రెస్ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతోపాటు, ప్రజలలోను చులకన అవుతున్నామనే భావానికి ఆ పార్టీ అధిష్ఠానం వచ్చింది.
ముఖ్యంగా సురేఖ వ్యవహారం లో సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఇరుకున పెట్టే క్రమంలో ఆయనపై విమర్శలు చేస్తూ సినీనటి సమంత ,నాగార్జున , నాగ చైతన్య( Samantha, Nagarjuna, Naga Chaitanya ) పేర్లను ప్రస్తావించడంతో చిక్కుల్లో పడ్డారు.
ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో అధిష్టానం సీరియస్ అయింది.అయితే జరిగిన నష్టాన్ని గుర్తించి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పించినా, ఈ విషయంలో నాగార్జున మాత్రం వెనక్కి తగ్గలేదు.
కొండా సురేఖ పై కోర్టు లో పరువు నష్టం దావా దాఖలు చేయడంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది.అంతేకాకుండా ఇదే విషయంపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ దృష్టికి అక్కినేని అమల తీసుకువెళ్లడం, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడంతో , తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రియాంక గాంధీ అమలకు హామీ ఇచ్చారట.ఒకవైపు మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్న సమయంలోనే , మరో వివాదంలో కొండా సురేఖ చిక్కుకున్నారు.సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి( Prakash Reddy ) వర్గీయులతో సురేఖ వర్గానికి మధ్య విభేదాలు తలెత్తయి.
ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది.
ఫోటోతో మొదలైన వివాదం కాస్త తర్వాత ఫ్లెక్సీ చించివేత వరకు వెళ్లాయి. ఆ తరువాత ధర్నాలు, దాడులు, అరెస్టుల వరకు ఈ వ్యవహారం వెళ్లడంతో , నేరుగా కొండ సురేఖ రంగంలోకి దిగారు. మంత్రి హోదాలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి సిఐ సీట్లోనే కూర్చోవడం , తమ వర్గీలను విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ చెప్పడం వివాదాస్పదంగా మారింది.సీఐ సీట్లో సురేఖ కూర్చోవడం, తన వర్గీయులను విడిచి పెట్టాలని మంత్రి హోదాలో సురేఖ ఆదేశించడంపై , విపక్షాలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకున్నాయి.
ఒక వైపు సమంత వ్యవహారం, మరోవైపు పోలీస్ స్టేషన్ వ్యవహారంతో వివాదాస్పదం గా మారిన కొండా సురేఖ పై చర్యలకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.