ఒకప్పుడు 60 ఏళ్ల వయసు దాటి పోయింది అంటే చాలు హీరోలు కేవలం తండ్రి పాత్రలకు మాత్రమే పనికొస్తారు.జూనియర్ హీరోలదే ఇండస్ట్రీలో హవా నడుస్తూ ఉంటుంది అని అనుకునే వారు.కానీ ఇప్పుడు మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు మాత్రం సినిమాలు చేసే సత్తా ఉండాలి కానీ వయసుతో పని ఏముంది అని నిరూపిస్తున్నారు.60ఏళ్ళ వయస్సు దాటి పోతున్నా యువ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.బాలయ్య మెగాస్టార్ చిరంజీవి నాగార్జున ఇలా టాలీవుడ్ లో మెయిన్ పిల్లర్ లుగా ఉన్న సీనియల్ హీరోలందరూ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.ఒక్కో హీరో 60 ఏళ్ల వయసులో కూడా ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
60 ఏళ్ళు వయస్సు దాటిపోతున్నా మెగాస్టార్ స్పీడు మాత్రం తగ్గలేదు.ఒకవైపు కథ కథనానికి ఇంపార్టెన్స్ ఇస్తూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఉన్నాడు. కొరటాల శివ తో చిరంజీవి చేసిన సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.మోహన్ రాజాతో గాడ్ ఫాదర్,మెహర్ రమేష్ తో బోలా శంకర్ చేస్తున్నాడు.
ఇక యంగ్ డైరెక్టర్స్ బాబి, వెంకీ కుడుముల తో కూడా సినిమాలను చేస్తున్న అంటూ ప్రకటించేశాడు మెగాస్టార్ చిరంజీవి.ఇక మొన్నీమధ్య సుకుమార్ దర్శకత్వంలో ఒక ప్రకటనలో నటించిన చిరంజీవి ఇక సుకుమార్ తో సినిమా చేసేందుకు కూడా రెడీ అయ్యాడు అని తెలుస్తోంది.
కొన్నాళ్లపాటు రాజకీయాలకే పరిమితమై వకీల్ సాబ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నాడు.ఇప్పటికే వకీల్ సాబ్ భీమానాయక్ సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్ లు అందుకున్నాడు పవన్ కళ్యాణ్.ఇక ఇప్పుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు భవదీయుడు భగత్ సింగ్ అని హరీష్ శంకర్ తో సినిమా కు రెడీ అయ్యాడు.
ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా సురేందర్ రెడ్డి తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు పవర్ స్టార్.
ఇక మరో సీనియర్ హీరో బాలయ్య సైతం సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఇక పూరి జగన్నాథ్ తో సినిమా కు రెడీ అయ్యాడు బాలకృష్ణ.
మాస్ మహారాజా రవితేజ సైతం తగ్గేదే లేదంటున్నాడు.ఖిలాడి తో నిరాశ పడిన రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న నాగార్జున మరి కొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టే పనిలో ఉన్నారు అని తెలుస్తోంది.