వందేళ్ల క్రితం మిస్ అయిన వ్యక్తి.. మౌంట్ ఎవరెస్ట్‌పై చూడగా..?

వందేళ్ల క్రితం మిస్సైన ఒక వ్యక్తి అవశేషాలు తాజాగా బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్( National Geographic ) ప్రకారం, ఎవరెస్ట్ పర్వతంపై 100 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఒక క్లైంబర్ శరీరం భాగం ఇటీవల కనిపించింది.

 A Person Who Was Missing A Hundred Years Ago.. When He Saw On Mount Everest, Ev-TeluguStop.com

కాలాంతరంలో వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాలలోని మంచు కరిగిపోతోంది, దీని ఫలితంగా ఎవరెస్ట్ పర్వతం( Mount Everest ) ఎక్కడానికి ప్రయత్నించి అక్కడే చనిపోయిన క్లైంబర్ల శరీరాలు బయటపడుతున్నాయి.

Telugu Andrew Irvine, Change, Everest, Glacier Melt, Remains, Climber, Mount Eve

1924లో, బ్రిటిష్ క్లైంబర్ ఆండ్రూ ఇర్విన్( Andrew Irvine ), ఆయన పార్ట్‌నర్ జార్జ్ మల్లోరీ, ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అదృశ్యమయ్యారు.మల్లోరీ శరీరం 1999లో కనిపించింది కానీ, ఆండ్రూ ఎక్కడ ఉన్నాడో తెలియ రాలేదు.ఇప్పుడు నేషనల్ జియోగ్రాఫిక్ బృందం ఎవరెస్ట్ సెంట్రల్ రోంగ్బుక్ గ్లేసియర్‌పై “A.C.IRVINE” అని రాసి ఉన్న ఒక సాక్స్‌, ఒక మానవ పాదంతో కూడిన బూట్‌ను కనుగొన్నారు.

Telugu Andrew Irvine, Change, Everest, Glacier Melt, Remains, Climber, Mount Eve

ఈ కొత్త ఆవిష్కరణ, క్లైంబర్ల వస్తువుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించి, పర్వతారోహణలో ఒక పెద్ద రహస్యాన్ని పరిష్కరించడానికి సహాయపడుతుంది.ఆండ్రూ, మల్లొరీ మరణించే ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారా అనే ప్రశ్నకు ఈ ఆవిష్కరణ సమాధానం ఇవ్వవచ్చు.వారు శిఖరాన్ని చేరుకున్నట్లయితే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులుగా రికార్డు సృష్టిస్తారు.1953లో ఎడ్మండ్ హిల్లరీ, తెన్జింగ్ నోర్గేలు ఈ పర్వతాన్ని చేరుకొని ఆ రికార్డు సొంతం చేసుకున్నారు.ఆండ్రూ వారి కంటే ముందే ఎవరెస్టు పైకి బయలుదేరాడు కానీ విజయవంతంగా చేరుకున్నాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.అయితే బంధువులు ఎట్టకేలకు మిస్సయిన ఆండ్రూ గురించి తెలుసుకుని ఎమోషనల్ అవుతున్నారు.

ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది శాంపిల్స్ అందించి దొరికిన ఆ విశేషాలు తమ ఆండ్రూనో కాదో నిర్ధారిస్తున్నారు.ఆయన పార్ట్‌నర్ తాము బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని కూడా ఒక లెటర్ రాసిందట.1920 నుంచి 300కు పైగా ప్రజలు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ప్రయత్నం చేస్తూ చనిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube