ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి పని ఒత్తిడి వల్ల ఎన్నో ఆర్థిక, మానసిక సమస్యలు ఏర్పడి ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో కొందరు మానసిక సమస్యల ( Psychological problems )వల్ల ఇబ్బంది పడుతుంటే.
మరికొందరు వాటిని తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు చాలానే చూసాము.ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా విద్యార్థులు చేయడం చూస్తూ ఉంటాము.
అలాగే కొందరు వారు చేసే పనుల వల్ల కూడా మానసిక సమస్యలు ఏర్పడి.చివరికి గుండె జబ్బులు తెచ్చుకోవడం, లేకపోతే మానసిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోనే పరిస్థితులను ఎదురుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తెలంగాణలోని మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీసులో చోటుచేసుకుంది.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.
తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబాబాద్( Mahbubabad ) జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తన గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గుండెబోయిన శ్రీనివాస్( Srinivas ) (56) కలెక్టర్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒంటరిగా కూర్చుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ విషాద సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆదివారం నాడు జరిగిన ఈ ఘటన సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న గుండెబోయిన శ్రీనివాస్ అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉన్నటువంటి అతడి వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్ తో తనను తాను గుండెపై కాల్చుకున్నాడు.దీంతో అతడు వెంటనే కూర్చున్న కుర్చీ నుంచి కిందకు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.తుపాకీ శబ్దం విని అక్కడ అతడితో పని చేస్తున్న సహ ఉద్యోగులు వెంటనే అక్కడి చేరుకుని పరిస్థితిని గమనించి విషయాన్ని ఉన్నత అధికారులకు సమాచారం అందించారు.