బిల్‌క్లింటన్‌ను గుర్తుపట్టని మెక్‌డొనాల్డ్స్ సిబ్బంది.. పేరు చెబితే కానీ, వీడియో వైరల్

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్( Former President Bill Clinton ) గురించి తెలియని వారుంటారా.దేశానికి 42వ అధ్యక్షుడిగానే కాకుండా, ఆర్కాన్సస్‌కు గవర్నర్‌గానూ క్లింటన్ సేవలందించారు.

 Mcdonald's Worker Fails To Recognise Ex Us President Bill Clinton , Ex Us Presid-TeluguStop.com

భారత్‌- అమెరికా( India- America ) సంబంధాల బలోపేతానికి బీజాలు వేసిన వారిలో క్లింటన్ ముందుంటారు.తన హయాంలో భారత్‌ను సందర్శించిన ఆయన ఎన్నో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లో పర్యటించారు.అలాంటిది సొంత దేశంలోని పౌరులే క్లింటన్‌ను గుర్తు పట్టలేకపోయారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున బరిలో దిగిన కమలా హారిస్ కోసం మాజీ అధ్యక్షులు ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే బరాక్ ఒబామా ( Barack Obama )ఆమె కోసం ర్యాలీలు, సభల్లో పాల్గొనగా.

తాజాగా బిల్ క్లింటన్ జార్జియాలో( Georgia ) ప్రచారం చేశారు.ఈ సందర్భంగా అక్కడి మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌ను( McDonald’s outlet ) సందర్శించడానికి వెళ్లగా విచిత్ర సంఘటన జరిగింది.

స్వయంగా మాజీ అధ్యక్షుడిని మెక్ డొనాల్డ్స్ సిబ్బంది గుర్తించలేకపోయారు.ఆయన తన పేరు చెబితే కానీ అక్కడి వారికి వచ్చింది ఎవరో అర్ధం కాలేదు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telugu Barack Obama, Clinton, India America, Mcdonald, Mcdonaldsfails-Telugu NRI

సదరు వీడియోలో బిల్ క్లింటన్ మెక్‌డొనాల్డ్స్ ఔట్ లెట్‌లోని కౌంటర్ వద్ద నిలబడి ఉండగా.అక్కడి మహిళ వచ్చిందెవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇంతలో క్లింటన్ తన పేరు చెప్పగానే అంతా షాక్ అవుతారు.

ఆమె కూడా కౌంటర్ నుంచి బయటికొచ్చి క్లింటన్‌ను హత్తుకుంటుంది.దీనిని తోటి సిబ్బంది తమ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అవుతోంది.

అనంతరం క్లింటన్ సదరు ఔట్‌లెట్‌లోని ఇతర సిబ్బందితో ముచ్చటించి, సెల్ఫీలు దిగుతారు.

Telugu Barack Obama, Clinton, India America, Mcdonald, Mcdonaldsfails-Telugu NRI

ఇక స్వింగ్ స్టేట్స్‌లో ఒకటైన జార్జియాలో కమలా హారిస్‌కు మద్ధతుగా క్లింటన్ శ్రమిస్తున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను విద్యార్ధిగా ఉన్నప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేశానని గుర్తుచేసుకున్నారు.తమ కుటుంబాలను పోషించడానికి ఎంతోమంది అమెరికన్లు అక్కడ పనిచేస్తున్నారని బిల్ క్లింటన్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube