బాలయ్య కృష్ణుడు.. ఎన్టీఆర్ అర్జునుడు.. ఈ వార్తలు నిజమైతే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ( Balayya, Jr.NTR )కాంబో నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో అనే సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ( Mokshajna’s first movie ) షూట్ త్వరలో మొదలుకానుంది.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నిరీక్షణ మరికొన్ని రోజుల్లో తీరబోతుంది.

 Balakrishna Ntr Combo Become Hot Topic Details Inside Goes Viral In Social Me-TeluguStop.com

ఈ సినిమా మహాభారతం బ్యాక్ డ్రాప్ లో తెరకక్కనుందని వార్తలు వినిపించగా ఆ వార్తలే నిజమయ్యాయని సమాచారం అందుతోంది.

ఈ ప్రాజెక్ట్ లో బాలయ్య కృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్ అర్జునుడిగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

వైరల్ అయిన వార్త అధికారికంగా ధృవీకరించిన వార్త కాకపోయినా ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.బాలయ్య అడిగితే జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు.

Telugu Balakrishna, Balakrishnantr, Balayya Krishna, Ntr Arjuna, Mokshajnas-Movi

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం భాగమైతే మాత్రం ఈ సినిమా క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది.షేర్ కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తోంది.మోక్షజ్ఞ లుక్స్ కు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి.

Telugu Balakrishna, Balakrishnantr, Balayya Krishna, Ntr Arjuna, Mokshajnas-Movi

2026లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విడుదల కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ హీరోయిన్ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరోయిన్ కే ఈ సినిమాలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాతోనే సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.మోక్షజ్ఞకు సెలబ్రిటీల సపోర్ట్ భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube