బాలయ్య కృష్ణుడు.. ఎన్టీఆర్ అర్జునుడు.. ఈ వార్తలు నిజమైతే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ( Balayya, Jr.NTR )కాంబో నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబో అనే సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ( Mokshajna's First Movie ) షూట్ త్వరలో మొదలుకానుంది.

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానుల నిరీక్షణ మరికొన్ని రోజుల్లో తీరబోతుంది.

ఈ సినిమా మహాభారతం బ్యాక్ డ్రాప్ లో తెరకక్కనుందని వార్తలు వినిపించగా ఆ వార్తలే నిజమయ్యాయని సమాచారం అందుతోంది.

ఈ ప్రాజెక్ట్ లో బాలయ్య కృష్ణుడిగా జూనియర్ ఎన్టీఆర్ అర్జునుడిగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

వైరల్ అయిన వార్త అధికారికంగా ధృవీకరించిన వార్త కాకపోయినా ఈ వార్త నిజమైతే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

బాలయ్య అడిగితే జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు.

"""/" / మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సైతం భాగమైతే మాత్రం ఈ సినిమా క్రియేట్ చేసే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు.

ఈ మధ్య కాలంలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తోంది.

షేర్ కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తోంది.మోక్షజ్ఞ లుక్స్ కు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి.

"""/" / 2026లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విడుదల కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ హీరోయిన్ విషయంలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరోయిన్ కే ఈ సినిమాలో ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాతోనే సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.మోక్షజ్ఞకు సెలబ్రిటీల సపోర్ట్ భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.

బాలయ్య కృష్ణుడు.. ఎన్టీఆర్ అర్జునుడు.. ఈ వార్తలు నిజమైతే ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!