ఓ చిన్న టెక్నీషియన్‌కి క్షమాపణలు చెప్పిన దర్శక దిగ్గజం కె.వి.రెడ్డి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జక్కన్న( Jakkana ) కంటే టాలెంటెడ్ దర్శకుడు ఒకరు ఉన్నారు.ఆయనే కె.

 Kv Reddy Apologies To Small Technician ,jakkana, Kv Reddy, Nagaya, Lightboy, Sh-TeluguStop.com

వి.రెడ్డి( KV reddy ).రాజమౌళి టాలీవుడ్ రేంజ్‌ను హాలీవుడ్‌కి ఎలా తీసుకెళ్లారో అలానే కె.వి.రెడ్డి కూడా తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో టాలీవుడ్ రేంజ్‌ని బాగా పెంచేశారు.ఆయన డైరెక్షన్‌లో వచ్చిన పాతాళభైరవి, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

టెక్నాలజీ అంతగా అభివృద్ధి కానీ సమయంలో ఇలాంటి సినిమాలు ఎలా తీశారు అని ఎవరైనా సరే ఆశ్చర్యపోక తప్పదు.

కె.

వి.రెడ్డి 30 ఏళ్లు సినీ పరిశ్రమలో ఉంటూ జస్ట్ 14 మాత్రమే డైరెక్ట్ చేశారు.అంటే ఆయన ఒక్కో సినిమా కోసం ఎన్ని రోజులు ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవచ్చు.కె.వి.రెడ్డి మొత్తం 14 సినిమాలు తీస్తే వాటిలో 10 సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి.అవి నిర్మాతల భవిష్యత్తులనే మార్చేశాయి.కె.వి.రెడ్డి చాలా సింపుల్ గా ఉంటారు.మామూలు బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.మొదటగా ప్రొడక్షన్‌ మేనేజర్‌గా ఇండస్ట్రీలో చేరారు.‘భక్తపోతన (1943)’తో డైరెక్టర్‌గా మారారు.తర్వాత ఆయన చేసిన సినిమా పేరు ‘యోగి వేమన’.

ఈ రెండింటిలోనూ నాగయ్యే( Nagaya ) మెయిన్ క్యారెక్టర్ చేశాడు.వీటి తర్వాత ‘గుణసుందరి కథ’ చిత్రంతో కె.వి.రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.1951లో ‘పాతాళ భైరవి’ సినిమా తీసి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు కె.వి.రెడ్డి.ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమై రిలీజ్ అయింది.

ఈ మూవీతో ఎస్వీ రంగారావు, ఎన్టీ రామారావు ఓవర్‌నైట్ స్టార్లు అయిపోయారు.

Telugu Jakkana, Kv Reddy, Kvreddy, Lightboy, Nagaya-Movie

దీని తర్వాత ఎన్టీఆర్, కె.వి.రెడ్డి కాంబినేషన్‌లో ఏడు సినిమాలు వచ్చాయి.అవన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి.ఇన్ని హిట్స్ ఇచ్చిన కె.వి.రెడ్డిపై ఎన్టీఆర్‌కు చాలా గౌరవం పెరిగిపోయింది.1960 దశకం వరకు కె.వి.రెడ్డి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా కొనసాగారు.తర్వాత సత్య హరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీశంకరుల కథ, భాగ్యచక్రము వంటి సినిమాలు ఫ్లాప్‌ కావడం వల్ల ఆయన వద్దకు నిర్మాతలు రావడం మానేశారు.

మూడేళ్ల పాటు కె.వి.రెడ్డి ఖాళీగానే కూర్చున్నారు.ఈ విషయం తెలిసిన ఎన్‌.

టి.రామారావు వెంటనే తన సొంత నిర్మాణ సంస్థ ఎన్‌.ఎ.టి.పిక్చర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న శ్రీకృష్ణసత్య చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కె.వి.రెడ్డికి అందజేశారు.వరస ఫ్లాపులు తీసిన డైరెక్టర్‌గానే చనిపోతానేమో అని అప్పటిదాకా బాధపడిన కె.వి.రెడ్డి ఎన్టీఆర్ ఇచ్చిన ఆఫర్‌తో ఎంతో సంతోషించారు.“శ్రీకృష్ణసత్య” సూపర్‌హిట్ కావడంతో ఆయన ఆనందం రెట్టింపు అయింది.అదే సంతోషంలో కె.వి.రెడ్డి చనిపోయారు.ఈ దర్శకుడు చేసింది తక్కువ సినిమాలే అయినా అవి తరతరాల ప్రేక్షకులను బాగా అలరించేలాగా ఉంటాయి.అంతటి ప్రతిభావంతుడు, దిగ్గజ దర్శకుడు అయిన కె.వి.రెడ్డి ఒక సందర్భంలో ఓ సాధారణ లైట్‌బాయ్‌కి క్షమాపణ చెప్పడం జరిగింది.ఆయన దగ్గర అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు అలా ఆయన ఎందుకు చెప్పారో వివరించారు.

Telugu Jakkana, Kv Reddy, Kvreddy, Lightboy, Nagaya-Movie

సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ.‘శ్రీకృష్ణార్జున యుద్ధం’( Shrikrishnarjuna Yuddam ) షూటింగ్‌ జరుగుతున్నప్పుడు బ్రహ్మను కమలంలో కూర్చోబెట్టాం.బ్రహ్మకు కుడివైపున సరస్వతి, ఎడమవైపున బృహస్పతి ఉన్నారు.

వారిద్దరితో బ్రహ్మ మాట్లాడే సీన్ ఉంటుంది.కె.వి.రెడ్డి ఆ షాట్ కరెక్ట్‌గా షూట్ చేశారు.తరువాత నా దగ్గరికి రామయ్య అనే లైట్‌బాయ్‌( Lightboy ) వచ్చి ‘నాకు చిన్న సందేహం సార్‌, బ్రహ్మకి నాలుగు తలలు ఉన్నాయి కదా.మరి సరస్వతి, బృహస్పతితో సంభాషించేటప్పుడు వారివైపు ఎందుకు తల తిప్పుతున్నాడు.మిగతా తలలతో మాట్లాడితే అయిపోతుంది కదా’ అని ప్రశ్నించాడు.ఆ లాజిక్ విని నేను ఆశ్చర్యపోయా.అంతలోనే కె.వి.రెడ్డి అక్కడికి వచ్చి లైట్‌బాయ్ అడిగిన సందేహాన్ని తెలుసుకున్నారు.అప్పుడు ఆయన బదులిస్తూ ‘నువ్వు అలా అడగడంలో తప్పులేదు.

నిజానికి షాట్ అలాగే తీయాలి కానీ ఆర్టిస్టు తల తప్ప మిగతా తలలన్నీ డూపే.అవి మాట్లాడేటట్టు చూపించే టెక్నాలజీ మన దగ్గర లేదు, అందుకు దయచేసి నన్ను క్షమించు.

నీ సందేహాన్ని తీర్చే టెక్నాలజీ భవిష్యత్తులో రావచ్చు, అప్పటిదాకా ఇలాంటి సన్నివేశం తీసిన నన్ను క్షమించు.’ అన్నారు కె.వి.రెడ్డి.” అని వెల్లడించారు.ఒక మామూలు లైట్‌బాయ్‌కి క్షమాపణ చెప్పడం కె.వి.రెడ్డి సంస్కారానికి నిదర్శనమని ఈ ఇంటర్వ్యూ చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube