ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమాలలో వేట్టయన్ మూవీ( Vettayan movie ) ఒకటి.ఈ సినిమా తమిళనాడులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగులో మాత్రం యావరేజ్ గా నిలిచింది.
మిక్స్డ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో మాత్రం అదరగొట్టింది.తమిళంలో ఈ సినిమాకు 4 రోజుల్లో ఏకంగా 240 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.
టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రజనీకాంత్ అభిమానులకు ఎంతగానో నచ్చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమాకు వచ్చిన నెట్ కలెక్షన్లు 104 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
రజనీకాంత్ కెరీర్ లో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు 6 ఉండగా వేట్టయన్ మూవీ ఏడో సినిమాగా నిలిచింది.రజనీకాంత్ కు సొంతమైన ఈ రికార్డ్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషం కలిగిస్తోంది.
రజనీకాంత్ నటించిన కొన్ని ఫ్లాప్ సినిమాలు సైతం సులువుగానే ఈ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం.రజనీకాంత్ ( Rajinikanth )సినిమాలకు అనుగుణంగా వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో కష్టపడుతున్నారు.సినిమాలకు సంబంధించి వచ్చిన విమర్శలను పాజిటివ్ గా తీసుకుంటూ తర్వాత సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా రజనీకాంత్ జాగ్రత్త పడుతున్నారు.
రజనీకాంత్ తమిళనాడులో( Tamil Nadu ) రెమ్యునరేషన్ పరంగా టాప్ హీరో అనే సంగతి తెలిసిందే.రజనీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉండగా కూలీ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ క్యాస్టింగ్ తో తెరకెక్కుతోంది.రజనీకాంత్ జైలర్ స్థాయి హిట్లను సాధిస్తే అభిమానులు ఎంతగానో సంతోషిస్తారని కచ్చితంగా చెప్పవచ్చు.
రజనీకాంత్ భారీ హిట్లను అందుకుంటే అభిమానులు ఎంతగానో సంతోషిస్తారని చెప్పవచ్చు.టీజే జ్ఞానవేల్ తర్వాత మూవీ సూర్య హీరోగా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.