ఈ రోజుల్లో రోడ్లపై వాహనాల సంఖ్య పెరుగుతూ ఉండటం, ప్రజా రవాణా సరిగ్గా లేకపోవడం వల్ల చాలామందికి ప్రయాణ సమయం పెరుగుతుంది, రోజూ ఆఫీస్ కి ఇలాంటి ట్రాఫిక్ ఎదుర్కొని వెళ్లాల్సి వస్తోంది కాబట్టి చాలామంది ఉద్యోగులు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు.కానీ చైనాలోని ఒక వ్యక్తి మాత్రం ఆకాశంలోని నిర్మించిన రోడ్డుపై బస్సులో ఆఫీస్ కి వెళ్తాడు.రోజూ ఎలా ఉద్యోగానికి వెళ్తాడో చూపిస్తూ ఆయన తీసిన వీడియోను X (ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు.“చాంగ్చింగ్లో ప్రయాణించడం ఎంత కష్టమో తెలుసా?” అని ఆయన అడిగాడు.అతడి వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఆయన ఆకాశంలో వేసిన రోడ్డు మార్గం(road in the sky) లో నడుస్తున్న బస్సు పై ఎక్కి కూర్చుంటాడు అలా అతను ఆకాశంలో బస్సు ప్రయాణం చేస్తాడు.
ఈ వీడియో ఓపెన్ చేస్తే మొదటగా ఆ వ్యక్తి తన అపార్ట్మెంట్ నుంచి బయలుదేరుతూ కనిపిస్తాడు.ఆ భవనంలో ఎలివేటర్(Elevator) లేదు, అంతేకాక ఆయన అపార్ట్మెంట్ 18వ అంతస్తులో ఉంది.“నేను 18వ అంతస్తు నుంచి కిందకు వెళ్లాల్సి ఉంటుంది.కానీ నా అదృష్టవశాత్తు, గ్రౌండ్ ఫ్లోర్ 12వ అంతస్తు నుంచే మొదలవుతుంది కాబట్టి నేను కొన్ని అంతస్తులు మాత్రమే కిందకు వెళ్లాల్సి ఉంటుంది.” అని ఆయన చెప్పారు.
ఆయన నివసించే భవనం చాలా ఎత్తుగా ఉంటుంది.ఆ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ మనం సాధారణంగా అనుకునేలా భూమిమీద కాదు, చాలా ఎత్తులో ఉంటుంది.అందుకే ఆయన తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లాలంటే చాలా అంతస్తులు మెట్ల మీద కిందకు వెళ్లాల్సి ఉంటుంది.
ఆయన కెమెరాను కిందకు చూపిస్తూ, “భూమిమీద నివసించే వాళ్లకు సూర్యకాంతి ఎంతో విలువైనదని ఇప్పుడు నాకు అర్థమవుతుంది” అని చెప్పాడు.ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సబ్వే స్టేషన్‌కు వెళ్తాడు.
ఆ సబ్వే స్టేషన్‌ను(subway station) చూసి ఆయన “ఇది ఏదో ఫిల్మ్‌లో చూసిన అణ్వాయుధం దాక్కోవడానికి ఉపయోగించే బంకర్ లాగా ఉంది” అని వర్ణించాడు.సబ్వే ట్రైన్లో ప్రయాణిస్తూ “ఈ సబ్వే ట్రైన్ రోలర్ కోస్టర్ లాగా ఉంది.
ఇది ఒక భవనం గుండా వెళ్లి మరొక భవనం గుండా వెళ్తుంది” అని చెప్పాడు.ఆయన తీసిన వీడియోలో ట్రైన్ ఒక పెద్ద వంతెన మీద వెళ్తూ చాలా ఎత్తులో ఉన్న భవనాల మధ్య నుంచి వెళుతున్నట్లు కనిపిస్తుంది.
సబ్వే జర్నీ తర్వాత ఆయన తన ఆఫీసు ఉన్న స్క్వేర్‌కు చేరుకుంటాడు.ఆ స్క్వేర్ చాలా పెద్దదిగా ఉంటుంది.చుట్టూ ఎత్తైన భవనాలు ఉంటాయి.ఆయన స్క్వేర్‌లోని ఒక రైలింగ్ మీద నిలబడి కిందకు చూస్తే, తాను నిలబడి ఉన్న స్క్వేర్ అంతా ఆయన ఆఫీసు భవనం 22వ అంతస్తులో ఉందని తెలుసుకుంటాడు.ఆఫీసు సమయం అయ్యాక ఆయన ఇంటికి బస్సులో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.“సబ్వే జర్నీ చాలా కష్టంగా ఉంది.బస్సులో ప్రయాణించడం కాస్త సౌకర్యంగా ఉంటుంది” అని ఆయన జోక్ చేశాడు.ఆ తర్వాత ఆయన బస్సులో ప్రయాణిస్తూ ఒక పెద్ద వంతెన మీద వెళ్తున్నాడు.“ఎలాగోలా ఈ బస్సు నన్ను ఆకాశంలో 20 అంతస్తుల ఎత్తుకు తీసుకెళ్తుంది” అని ఆయన చెప్పాడు.ఈ వీడియోకి కోట్లలో వ్యూస్ వచ్చాయి చాలామంది తిని చూసి మూవీ లో సీన్ చూసినట్లుగా ఉందని పేర్కొంటున్నారు.