ఇండియన్ అబ్బాయిలతో డేటింగ్ మాములుగా ఉండదు.. ఆస్ట్రేలియన్ మహిళ కామెంట్స్..

ఆస్ట్రేలియాకు చెందిన బ్రీ స్టీల్ అనే మహిళ ఇండియా గురించి చాలా వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయింది.ఈ ఆస్ట్రేలియన్ యువతి రీసెంట్ టైమ్స్ లో భారతదేశ అబ్బాయిలతో(Indian boys) డేటింగ్ చేసిందట.

 Dating With Indian Boys Is Not Normal Australian Woman Comments, Dating In India-TeluguStop.com

వారితో తాను పొందిన డేటింగ్ అనుభవాల గురించి తాజాగా ఒక ఇన్‌స్టా వీడియోలో చెప్పింది.ఆమె మాటలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.

పాడ్‌కాస్ట్ నిర్మాతగా పనిచేసే బ్రీ 2023 నుంచి భారతదేశంలో తిరుగుతూ ఉంది.ఆస్ట్రేలియాలోని పురుషులతో(Australia men)పోలిస్తే భారతీయ పురుషులు డేటింగ్ విషయంలో ఎంతగా భిన్నంగా ఉంటారో ఆమె చెప్పింది.రీసెంట్ వీడియోలో బ్రీ మాట్లాడుతూ “ఆస్ట్రేలియాలో పురుషులు ఫ్లర్ట్ చేయమంటే జోక్‌లు చెప్తారు, కొంచెం వెటకారంగా మాట్లాడతారు.కానీ భారతదేశంలో అందరూ చాలా మర్యాదగా ఉంటారు.ఇక్కడ సంబంధాలు చాలా త్వరగా ముందుకు సాగుతాయి.ఒక పార్టీలో ఒక అబ్బాయి నా చేయి పట్టుకున్నాడు.

ఇలాంటిది ఆస్ట్రేలియాలో ఎప్పుడూ జరగదు!” అని ఆశ్చర్యంగా తెలియజేసింది.

భారతదేశంలో బాలీవుడ్ సినిమాల(bollywood movie) ప్రభావం డేటింగ్‌పై బాగా పడిందని ఆమె అభిప్రాయపడింది.“ఇక్కడి వాళ్లు సినిమాల్లో చూసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు” అని చెప్పింది.“భారతదేశంలో ఈ తరం వాళ్లు మొదటిసారిగా కేజువల్‌గా డేటింగ్ చేస్తున్నారు.పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ చాలా కాలంగా సంస్కృతిలో భాగమైపోయింది కానీ ఇక్కడ అలా కాదు.పాశ్చాత్య దేశాల్లో డేటింగ్ స్టోరీస్ తరతరాలుగా ప్రచారంలో ఉన్నాయి, స్కూల్‌ల్లో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది.కానీ భారతదేశంలో అలాంటిది లేదు కాబట్టి, ప్రజలు సినిమాల నుంచి డేటింగ్ గురించి తెలుసుకుంటారు.” అని ఆమె వెల్లడించింది.ఇలాంటి డిఫరెంట్ డేటింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుందని ఆమె పేర్కొన్నది.ఆమె మాటలు విన్న చాలా మంది భారతీయులు మంచిగా ఫీలవుతున్నారు.ఇకపోతే చాలామంది ఫారెన్ గర్ల్స్ ఇండియన్ బాయ్స్ ని పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube