ఆరోగ్యమైన జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.ఆరోగ్యం బాగోక పోతే ఎంత సంపద ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
అందుకే సంపాదన పైనే కాకుండా ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి.డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.
ఇకపోతే కొన్ని రకాల జ్యూస్ లు ఆరోగ్యం విషయంలో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాయి.బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తాయి.
మరి ఏ జ్యూస్ దేనికి పనికొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పైనాపిల్ జ్యూస్.వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కు పవర్ హౌస్ లాంటిది.పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఆస్తమా లక్షణాలు అదుపులో ఉంటాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.పైనాపిల్ జ్యూస్ లో ఉండే బ్రోమెలైన్ సైనస్ లేదా ఛాతీలో రద్దీని కలిగించే శ్లేష్మాన్ని తొలగిస్తుంది.
బీట్ రూట్ జ్యూస్( Beetroot Juice ) గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది.బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
రక్తనాళాల్లో ఏర్పడిన చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
దానిమ్మ జ్యూస్ రక్తహీనతను చాలా వేగంగా వదిలిస్తుంది.శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ ను అందిస్తుంది.దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.మూత్రపిండాల్లో రాళ్లను నిరోధించడంలో మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించే సమ్మేళనాలను కూడా దానిమ్మ జ్యూస్ కలిగి ఉంటుంది.క్యారెట్ జ్యూస్( Carrot juice ) కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
క్యారెట్‌లో లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటాయి.ఇవి రెటీనా మరియు లెన్స్‌ను రక్షించడంలో సహాయపడతాయి.
క్యారెట్‌లో ఉండే బీటా కెరోటిన్ అతినీలలోహిత కాంతి నుండి కళ్ళను రక్షిస్తుంది.క్యారెట్ జ్యూస్ కాలేయ ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ రోగ నిరోధక వ్యవస్థ( Immune system )ను బలపరుస్తుంది.బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.
మధుమేహం, క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.మరియు జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది.