మనోజ్ కూతురి అన్నప్రాసన.. మంచు లక్ష్మి ఇచ్చిన సర్ప్రైజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ), ఆయన భార్య మౌనికల గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో ఒకటి అయిన విషయం తెలిసిందే.

 Manchu Manoj Mounika Bhuma Daughter Devasena Annaprasana, Mounika, Manoj, Tollyw-TeluguStop.com

ఈ ఏడాది ఏప్రిల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది మౌనిక.ఇక మనోజ్ దంపతులు వారికి పుట్టిన బిడ్డకు దేవసేన శోభ ఎం ఎం అనే పేరును కూడా పెట్టిన విషయం తెలిసిందే.

ఇక ముద్దుగా ఆ చిన్నారిని ఎంఎం పులి అని పిలుచుకుంటూ ఉంటారు.ఇది ఇలా ఉంటే తాజాగా మౌనిక మనోజ్ దంపతులు ఈ చిన్నారికి అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మొదటిసారి ఆ చిన్నారికి ఆహారాన్ని తినిపించారు.

ఇక ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మీ హాజరయ్యారు.కోడలి అన్నప్రాసన కార్యక్రమానికి ముంబై నుంచి వచ్చేసింది మంచు లక్ష్మి.తన కూతురు యాపిల్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొంది.

అయితే కోడలి అన్నప్రాసన కార్యక్రమం గురించి మంచు లక్ష్మి కి చెప్పలేదట.కానీ మంచు లక్ష్మి( Manchu Lakshmi ) మాత్రం తన తమ్ముడు చెప్పకపోయినా సడన్గా తన కూతుర్ని తీసుకుని వెళ్లి వారికి సర్ప్రైజ్ ఇచ్చిందట.

ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్‌ తెగ సంతోషపడిపోయాడు.తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది.అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్‌ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం.అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.

ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నా మనసు సంతోషంతో నిండిపోయింది.

నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్‌ చేసింది.కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది.

మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటాము.నిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్‌ వస్తుందని మనోజ్‌కు తెలియదు.

తనను తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశాను.యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది.

కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు.నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube