చాలామంది భారతీయులు అమెరికా( America ) దేశానికి వెళ్లి సెటిల్ కావాలని కోరుకుంటారు.ఇండియన్స్ ఇలా అనుకుంటూ ఉంటే అమెరికన్స్ మాత్రం ఇండియాలో సెటిల్ అవుతున్నారు.
మనోళ్లు ఉపాధి ఇంకా ఈజీ లైఫ్ స్టైల్ కోసం యూఎస్‌కు వెళ్తున్నారు.వాళ్లేమో ట్రూ లైఫ్ సాగించడం ఇండియాలోనే సాధ్యం అని భావిస్తున్నారు.
విచిత్రంగా అనిపించినా ఇది నిజం.అలాంటి అమెరికన్ వ్యక్తులలో ఒకరైన క్రిస్టెన్ ఫిషర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ అమెరికన్ మహిళ ఇండియాకు వచ్చి ఇక్కడే స్థిరపడింది.ఆ తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో సోషల్ మీడియాలో పది విధాలుగా చెప్పింది.అవేంటంటే ఆమె ఇప్పుడు శాకాహారి అయిపోయింది, చాయ్‌పై చాలా ఇష్టం పెంచుకుంది, బస్సులో ప్రయాణం చేస్తుంది.ఇంకా ఇలాంటి చాలా మార్పులు తన జీవితంలో వచ్చాయని చెప్పింది.
క్రిస్టెన్ ఫిషర్( Kristen Fischer ) ఇండియాలోని ఢిల్లీ( Delhi )లో రెండేళ్లుగా ఉంటున్నారు.ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చేసింది.ఆ వీడియోలో ఆమె ఇండియా వచ్చిన తర్వాత తన జీవితం ఎంతగా మారిపోయిందో చెప్పింది.ఇండియా వచ్చి ఇక్కడి జీవన విధానానికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది అని, కానీ ఇప్పుడు ఇక్కడ తన జీవితం చాలా బాగుందని చెప్పింది.
ఇండియాలో ఉండడం ఆమెకి చాలా ఇష్టం.క్రిస్టెన్ ఫిషర్ ఇండియా వచ్చాక తన జీవితంలో మాంసం తినడం పూర్తిగా మానేసి, శాకాహారిని అయిపోయానని తెలిపింది.ఇండియన్ దుస్తులు ధరించడం కూడా మొదలుపెట్టింది.బస్సు, రైలు లాంటి వాటిలో ప్రయాణించడానికి అలవాటు పడిపోయింది.
రోజూ చాయ్ తాగుతుంది.తన పిల్లలను ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించింది.
చేత్తో భోజనం చేస్తుంది.రోజూ హిందీ మాట్లాడుతుంది.
ఇంటి పనులు చేతితో చేస్తుంది. వంటలు ఇంటిలోనే తయారు చేసుకుంటుంది.
ఇంటిలో శుభ్రమైన మరుగుదొడ్డి ఉపయోగిస్తుంది.ఆమె వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది చూశారు.
దాదాపు 17 లక్షల మంది వీక్షించారు.ఇండియా అమెరికా దేశాల మధ్య ఉన్న తేడాల గురించి ఆమె చాలా బాగా చెప్పారని చాలా మంది కామెంట్లు చేశారు.