విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అలా విదేశాల నుంచి వచ్చిన ఓ యువ ఇంజినీర్ హోం క్వారంటైన్ లో ఉంటూ మానసిక ఒత్తికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
బ్లెడ్ తో గొంతు కోసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బ్లెడ్ తో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళ రాష్ట్రంలోని కన్నూర్ లో చోటు చేసుకుంది.కువైట్ నుంచి వచ్చి టీవీ శరత్ (30) కన్నూర్ లోని తనింటి ఔట్ హౌస్ లో క్వారంటైన్ ఉంటున్నాడు.ఒకే దగ్గర ఉండటంతో మానసిక ఒత్తిడికి గురైన శరత్ గురువారం రాత్రి బ్లెడ్ తో తన గొంతును తానే కోసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
శనివారం ఉదయం శరత్ కుటుంబసభ్యులు టిఫిన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు గది మొత్తం రక్తంతో నిండి ఉందన్నారు.కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టామని, మృతదేహం వద్ద రెండు బ్లేడ్లు కనిపించాయని, వాటిని క్లూస్ టీంకు పంపించడం జరిగిందన్నారు.
ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.